ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా కూటమి పాలన సాగుతోంది. ముఖ్యంగా నగరాల్లో పట్టు నిలబెట్టుకున్న కూటమి పార్టీలు టీడీపీ, జనసేనలు.. వైసీపీకి అంతో ఇంతో బలం ఉన్న గ్రామాలపై ఇప్పుడు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే.. గ్రామాలను కుమ్మేస్తున్నాయి. ఈ పరిణామం వైసీపీలో బెంబేలెత్తిస్తోంది. వాస్తవానికి ఇప్పటి వరకు గ్రామీణ ఓటు బ్యాంకుపై వైసీపీ ఆధారపడుతోంది.
కానీ.. కూటమి పార్టీలైన టీడీపీ, జనసేనలు.. వైసీపీ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని గ్రామీణ స్థాయిలో చేపడుతున్న కార్యక్రమాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే.. గ్రామాల్లో రహదారుల నిర్మాణం చేపట్టిన పవన్ కల్యాణ్ పంచాయతీలను మరింతగా అభివృద్ధి చేస్తున్నారు. అదేసమయంలో పశువుల పాకలకు తాజాగా 200 కోట్ల రూపాయలను విడుదల చేశారు. దీంతో అన్ని గ్రామాల్లో పశువుల పాకలు విస్తరించనున్నాయి. అదేవిదంగా వైద్యాన్ని చేరువ చేయన్నున్నారు.,
అంటే.. రహదారులు, విద్యుత్ సౌకర్యంతో పాటు గ్రామీణులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక, టీడీపీ విషయానికి వస్తే.. వచ్చె నెల నుంచి 2 వతారీకు నుంచి 9 వ తారీకు వరకు గ్రామాల్లో పట్టాల పంపిణీ కార్యక్రమాన్నిచేపట్టనుంది. రీసర్వే ఆధారంగా కొత్తగా ఇస్తున్న పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మరింత హైలెట్ చేయడంతోపాటు.. వివాదాలను తక్షణమే పరిష్కరించా లని నిర్ణయించింది. దీంతో వచ్చే నెల నుంచి 1వ తారీకున పింఛను పంపిణీ అనంతరం.. 2 నుంచి 9 వ తారీకు వరకు పట్టాల పంపిణీ జరగనుంది.
తద్వారా గ్రామీణులు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు టీడీపీ, జనసేన లు నడుం బిగించాయి. ఇది సక్సెస్ చేయాలని స్వయంగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు.. ఈ కార్యక్రమాల పర్యవేక్షణ , నిర్వహణ బాధ్యతలను కూడా పార్టీ నాయకులకు అప్పగించారు. దీంతో రాజకీయంగా కూడా గ్రామాల్లో టీడీపీ, జనసేనలు మరింత బలోపేతం కానున్నాయి. ఎప్పటికప్పుడు దీనిపై పవన్ కల్యాణ్చంద్రబాబు సమీక్షించనున్నారు. సో.. మొత్తంగా గ్రామాల్లో ఇప్పుడున్న రాజకీయ స్వరూపం పూర్తిగా మారనుంది.ఇది వైసీపీకి మరింత శరాఘాతంగా మారనుంది.