దిగొచ్చిన జేసీ.. మాధవీ లతకు క్షమాపణలు..!

admin
Published by Admin — January 05, 2025 in Politics, Andhra
News Image

సినీ న‌టి, బీజేపీ మ‌హిళా నాయ‌కులు మాధ‌వీ ల‌త ఒక వ్యాభిచారి అంటూ టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నోరు జారి వార్త‌ల్లో ట్రెండ్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా జేసీ దిగొచ్చారు. మాధ‌వీ ల‌త‌కు మీడియా ముఖంగా క్ష‌మాణ‌లు చెప్పారు. వయసు, ఆవేశం రీత్యా మాధవి లత గురించి అలా మాట్లాడాను. ఒక మహిళ గురించి ఆ విధంగా మాట్లాడ‌టం క‌రెక్ట్ కాద‌ని జేసీ త‌న త‌ప్పును అంగీక‌రించారు. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం త‌న‌కు లేద‌ని.. మనస్ఫూర్తిగా మాధ‌వీ ల‌త‌కు క్షమాపణలు చెబుతున్నాన‌ని జేసీ ప్ర‌క‌టించారు.

ఇదే క్ర‌మంలో మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలపై ఇన్‌డైరెక్ట్ గా జేసీ సెటైర్స్ పేల్చారు. వైసీపీకి వెళ్లు అని చెబుతున్నారు.. అస‌లు తనను పార్టీ మారమని చెప్పే హక్కు ఎవరికీ లేదని జేసీ అన్నారు. త‌న‌కు చెప్పే ముందు ఆయన ఎక్కడి నుంచి వచ్చారో చూసుకోవాలని మంత్రి సత్యకుమార్ కు ప‌రోక్షంగా జేసీ హిత‌వు ప‌లికారు. త‌న గురించి మాట్లాడిన వారంతా ప్లెక్సీ గాళ్లు.. వీళ్లంతా అధికారం ఉన్న‌ప్పుడు కాదు లేన‌ప్పుడు మాట్లాడ‌ని కౌంట‌ర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు కోసమే తాను టీడీపీలో ఉన్నాన‌ని.. లేదంటే త‌న‌కు పార్టీనే అవసరమే లేద‌న్నారు. తాడిపత్రి ప్రజలే త‌న పార్టీ అని.. వారికోసం ఎంత దూర‌మైనా వెళ్తాన‌ని ఈ సంద‌ర్భంగా జేసీ తెలిపారు.

తన బస్సుల దహనం వెనుక బీజేపీ నేతల హస్తం ఉందంటూ ఆరోప‌ణ‌లు చేశారు. బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని మండిప‌డ్డారు. అలాగే నటి మాధ‌వీల‌త ఒక వ్యాభిచార‌ని.. ఆమెను బీజేపీలోకి ఎలా తీసుకున్నారో అర్థం కావాట్లేదంటూ జేసీ పరుష వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న వ్యాఖ్య‌లు వివాస్ప‌దం అయ్యాయి. మాధ‌వీల‌త‌తో పాటు బీజేపీ నాయ‌కులు జేసీ తీరు ప‌ట్ల తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. జేసీపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలని సీఎం చంద్ర‌బాబును డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో జేసీ దిగొచ్చి మాధ‌వీల‌త‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. మ‌రి ఇంత‌టితో వివాదం ముగుస్తుందా? లేదా? అన్న‌ది చూడాలి.

 
Recent Comments
Leave a Comment

Related News

Latest News