టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న `గీత గోవిందం` జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందానా త్వరలోనే ఒక ఇంటి వారు కాబోతున్నారా? గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో వినబడుతున్న ఈ ప్రశ్నలకు ఇప్పుడు అవును అనే సమాధానం బలంగా వినిపిస్తోంది. వీరిద్దరి ప్రేమాయణం గురించి ఎన్ని వార్తలు వచ్చినా ఇటు విజయ్ గానీ, అటు రష్మిక గానీ ఎప్పుడూ పెదవి విప్పలేదు. గత ఏడాది ఎంగేజ్మెంట్ జరగగా.. ఆ విషయాన్ని కూడా సీక్రెట్ గానే ఉంచారు. కానీ, ఇప్పుడు వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, వీరి పెళ్లి ముహూర్తం ఖరారైందని, రాజస్థాన్ వేదికగా వేడుకకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది.
ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ జంట తమ వివాహం కోసం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 26న అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరగనుందని టాక్. మరోవైపు ఫిబ్రవరి 2న విజయ్, రష్మిక మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది.
ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో పెళ్లి పనులు పర్యవేక్షిస్తున్న ఒక యువతి, ఇది విజయ్-రష్మిక వివాహ వేడుక కోసమేనని చెప్పడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. బాలీవుడ్ తరహాలో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఈ జంట మొగ్గు చూపినట్లు అర్థమవుతోంది. కానీ పెళ్లి తేదీ విషయంలో మాత్రం కొంద సందిగ్థత నెలకొంది. ప్రముఖ మీడియా సంస్థలు మాత్రం ఫిబ్రవరి 26 అనే తేదీనే ఎక్కువగా ప్రస్తావిస్తుండటం గమనార్హం.