ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌లు తాజా గా చేసిన వ్యాఖ్యలను బీజేపీ నాయకురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తీవ్రంగా ఖండించా రు. ఈ వ్యాఖ్యలు సభ్యసమాజాన్ని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని.. నవ్వుకునేలా ఉన్నాయని వ్యాఖ్యానిం చారు. వైసీపీ నాయకులకు చంద్రబాబు ను టార్గెట్ చేయడం ఇప్పుడే కొత్తకాదని పేర్కొన్నారు. గతంలో నూ అనేక సందర్భాల్లో వారు విమర్శించారని తెలిపారు.
అయితే.. చంద్రబాబును విమర్శించిన ప్రతిసారీ.. వైసీపీకి ప్రజలు బుద్ధి చెబుతున్నారని పురందేశ్వరి చెప్పారు. ఈ విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తు పెట్టుకోవాలని అన్నారు. చంద్రబాబు మాతృమూర్తిపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను మహిళలు ఎవరూ సహించబోరని వ్యాఖ్యానించారు. మళ్లీ మళ్లీ బుద్ధి చెప్పేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని పురందేశ్వరి హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుపరిపాలన సాగుతోందని చెప్పిన ఆమె.. దీనిని భగ్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు.
కేంద్ర బడ్జెట్‌పై..
కేంద్రం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై స్పందించిన పురందేశ్వరి.. ఈ బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు చేస్తుందన్నారు. దీర్ఘకాలిక లక్ష్య సాధనను దృష్టిలో పెట్టుకుని చాలా ఆచితూచి అడుగులు వేశారని.. దీనివల్ల అన్నిరాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు. అదేసమయంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని, తలసరి ఆదాయం కూడా పెరుగుతుందని తెలిపారు. అవగాహన లేని కొందరు(రాహుల్‌గాంధీ) చేస్తున్న విమర్శలను ప్రజలు కూడా పట్టించుకోవడం లేదన్నారు.
రాష్ట్రానికి సంబంధించి పోలవరానికి 3 వేల కోట్లు, అమరావతి రాజధానికి 1000 కోట్ల పైచిలుకు నిధులు రానున్నాయన్నారు. డేటా కేంద్రాలకు మరింత అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. ఎం.ఎస్.ఎం.ఈ లకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని పురందేశ్వరి తెలిపారు. తద్వారా నిరుద్యోగ సమస్యలను వచ్చే మూడేళ్లలో తగ్గించాలన్న లక్ష్యంతో ఉన్నామని చెప్పారు. రాష్ట్రానికి బడ్జెట్‌లో భారీ ప్రయోజనం లభిస్తుందని తెలిపారు.