సియామీ కవలల గురించి వినే ఉంటారు. ఒకే దేహాన్ని పంచుకుని పంచుకుని పుట్టిన వారిని సియామీ కవలలుగా పేర్కొంటారు. సాధారణంగా కవల పిల్లలు అంటే వేర్వేరుగా పుడతారు. కానీ, సియామీ కవలలు మాత్రం అతుక్కుపోయిన శరీర భాగాలతో జన్మిస్తారు. ఇలానే.. ఇప్పుడు ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ ఎస్‌లు రెండూ కూడా సియామీ కవలలను తలపిస్తున్నా యన్న వాదన వినిపిస్తోంది.
అధికారంలో ఉన్నప్పుడు.. ఈ రెండు పార్టీల అధినేతలు.. కూడా ప్రజలకు చేరువ కాలేకపోయారు. ఇంటికే పరిమితం అయ్యారు. అంతేకాదు.. తాము చేసిందే శాసనం అన్నట్టుగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థులపై కత్తికట్టినట్టు వ్యవహరించారు. ఇటు చంద్రబాబు.. అటు.. తెలంగాణలో రేవంత్ రెడ్డి వంటి బలమైన నాయకులను టార్గెట్ చేసుకుని రెచ్చిపోయారు. అంతేకాదు.. వ్యవస్థలను కూడా భ్రష్టు పట్టించారన్న చెడ్డపేరును మోసుకున్నారు.
ముఖ్యంగా ఎన్నికల్లో విజయం కోసం.. ఏపీలో అక్రమ మద్యం ద్వారా వచ్చిన సొమ్మును ఖర్చు చేశారని.. అక్రమ మద్యంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందమే తేల్చేసింది. దీనిపై వేసిన తొలి చార్జిషీట్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇక, తెలంగాణలోనూ.. 2023 ఎన్నికలకు ముందు ఫోన్ ట్యాపింగ్ చేయ డం ద్వారా ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారని.. కేసీఆర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసులోనే ఆయన విచారణకు కూడా హాజరయ్యే పరిస్థితి వచ్చింది.
ఇక, జల వివాదాల విషయంలోనూ.. విభజన అంశాలలోనూ.. అటు జగన్, ఇటు కేసీఆర్ లోపాయికారీ ఒ ప్పందాలు చేసుకుని.. రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీశారని.. ఇరు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం అధికారంలో ఉన్న నాయకులు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇక, అధికారం పోయిన తర్వాత.. కూడా ఒకే పంథా .. అన్నట్టుగా వైసీపీ, బీఆర్ ఎస్‌లు వ్యవహరిస్తున్నాయన్న చర్చ ఇప్పటికీ జరుగుతోంది. దీనివల్ల రెండు పార్టీలు కూడా.. డైల్యూట్ అవుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.