చెన్నైలో ఇంట్రెస్టింగ్ సీన్.. వైఎస్ జగన్‌తో కోలీవుడ్ స్టార్స్ సందడి!

admin
Published by Admin — February 08, 2026 in Politics, Movies
News Image

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెన్నై పర్యటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇది రాజకీయ పర్యటన కాదు.. ఒక ఆత్మీయ కలయిక. చెన్నైలో జరిగిన తన సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ వివాహ వేడుకకు హాజరైన జగన్, అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ వేడుకలోనే ఊహించని విధంగా కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తీ కూడా మెరిశారు.

సాధారణంగా వైఎస్ జగన్ రాజకీయ సభల్లో ఎంత గంభీరంగా కనిపిస్తారో, వ్యక్తిగత వేడుకల్లో అంత సరదాగా ఉంటారు. ఈ వివాహ వేడుకలో సూర్య, కార్తీలతో జగన్ ఎంతో ఆత్మీయంగా ముచ్చటించారు. వారందరూ కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటున్న దృశ్యాలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రాజకీయ రంగంలోని అగ్రనేత, సినిమా రంగంలోని ఇద్దరు స్టార్ హీరోలు ఇలా ఒకే వేదికపై పలకరించుకోవడం చూసి అభిమానులు మురిసిపోతున్నారు.

మ‌రోవైపు జగన్ వస్తున్నారని తెలియగానే వివాహ వేదిక వద్దకు అభిమానులు, వైసిపి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కేవలం పార్టీ శ్రేణులే కాకుండా, స్థానిక ప్రజలు కూడా ఆయన్ని చూసేందుకు, ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. కాగా, ఫిబ్రవరి 8న జరిగిన సాహిల్ – వేదికల వివాహ వేడుకకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా జగన్ తో సూర్య, కార్తీ మాట్లాడుతున్న ఫోటోలు తెగ‌ ట్రెండ్ అవుతున్నాయి. రాజకీయ ప్రముఖులు, సినీ గ్లామర్ తోడవ్వడంతో ఈ పెళ్లి వేడుక కాస్తా ఒక మెగా ఈవెంట్‌లా మారిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

https://twitter.com/ashokyadav_AKY/status/2020372131717267803

Tags
YS Jagan Suriya Karthi Chennai Kollywood YSRCP Viral Video
Recent Comments
Leave a Comment

Related News