అధికారులకు చెమటలు పట్టించిన చంద్రబాబు

admin
Published by Admin — January 09, 2025 in Politics
News Image

తిరుప‌తిలోని శ్రీనివాసం స‌హా బైరాగిప‌ట్టెడ ప్రాంతాల్లో బుధ‌వారం రాత్రి చోటు చేసుకున్న తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతి చెందారు. మ‌రో 41 మంది గాయ‌ప‌డ్డారు. వీరిలో 30 మంది డిశ్చార్జ్ కాగా.. మ‌రో 11 మంది తీవ్ర గాయాల‌తో చికిత్స పొందుతున్నారు. ఇక‌, బాధిత కుటుంబాల‌కు కూట‌మి స‌ర్కారు న‌ష్ట ప‌రిహారం ప్ర‌క‌టించింది. రూ.25 ల‌క్ష‌లు చొప్పున ఇవ్వ‌నున్న‌ట్టు స‌ర్కారు ప్ర‌క‌టించింది. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న వారికి కూడా.. సాయం అందిస్తామ‌ని మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ తెలిపారు. ఇదిలావుంటే.. తాజాగా తిరుప‌తికి చేరుకున్న సీఎం చంద్రబాబు ఇక్క‌డి ప‌రిస్థితుల‌ను అడిగి తెలుసుకున్నారు.

నేరుగా ఆయ‌న రేణిగుంట విమానాశ్ర‌యం నుంచి తిరుప‌తిలో బుధ‌వారం రాత్రి తొక్కిస‌లాట జ‌రి గిన ప్రాంతంలో ప‌ర్య‌టించారు. అధికారుల‌ను వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా వైకుం ఠ ద్వార ద‌ర్శ‌నం టోకెన్లు మంజూరు చేసే కౌంట‌ర్ల ను కూడా ఆయ‌న ప‌రిశీలించారు. ఏయే గేట్ల నుంచి ప్ర‌జ‌ల‌ను వ‌దిలి పెట్టార‌ని.. క్యూలైన్ల‌ను ఎక్క‌డెక్క‌డ ఏర్పాటు చేశార‌ని కూడా ప్ర‌శ్నించారు.

ఈ సంద‌ర్భంగా టీటీడీ ఈవో జె. శ్యామ‌ల‌రావుపై చంద్ర‌బాబు సీరియ‌స్ అయ్యారు. అంత చిన్న గేటు నుం చి భ‌క్తుల‌ను లోప‌లికి పంపించేందుకు ఎలా అనుమ‌తించార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. దీనికి సంబంధించి ఎవ రు ప్ర‌పోజ‌ల్ చేశార‌ని కూడా నిల‌దీశారు. ముంద‌స్తుగా భ‌క్తుల ర‌ద్దీని ఎందుకు అంచ‌నా వేయ‌లేకపో యార‌ని.. ప్ర‌శ్నించారు. భ‌క్తుల సంఖ్య ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు.. ఆ మేర‌కు ఏర్పాట్లు చేయ‌డంలో విఫ‌ల‌మైన వారి వివ‌రాల‌ను త‌న‌కు ఇవ్వాల‌ని సూచించారు.

అనంత‌రం.. మ‌రో ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్యూలైన్ల‌ను కూడా సీఎం ప‌రిశీలించారు. అధికారుల నిర్ల క్ష్యం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంద‌ని సీఎం వ్యాఖ్యానించారు. దీనిపై నోట్ త‌న‌కుపంపించాల‌న్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి ప‌లు విష‌యాల‌ను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. క్యూలైన్ల నిర్వ‌హ‌ణ‌లో ఓ అధికారి నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆయ‌న తెలిపారు. అదేవిధంగా అంచ‌నా వేయ‌లేక‌పోవ‌డంతో భ‌క్తులకు సరైన వ‌స‌తులు కూడా ఏర్పాటు చేయ‌లేక పోయార‌ని సీఎంకు వివ‌రించారు.

 
Recent Comments
Leave a Comment

Related News