వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు షాక్ తగిలింది. పార్టీని బలోపేతం చేసేందుకు గత కొద్దిరోజుల నుంచి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తున్న వైఎస్ జగన్.. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ గా అంబటిని తప్పించి కొత్త రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. గజ్జల సుధీర్ భార్గవరెడ్డిని నూతన సమన్వయకర్తగా నియమించారు.
గజ్జల సుధీర్ భార్గవరెడ్డి విషయానికి వస్తే.. సత్తెనపల్లిలో 90 శాతం మంది వైసీపీ క్యాడర్ కు ఈయనెవరో కూడా తెలియదు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లు మండలానికి చెందిన సుధీర్ భార్గవరెడ్డి ప్రస్తుతం నరసరావుపేటలో ఉంటున్నారు. ఈయన ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్. ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో సుధీర్ భార్గవరెడ్డికి కీలకమైన నియోజకవర్గానికి వైసీపీ ఇంచార్జ్ గా జగన్ అవకాశం కల్పించారు. మరోవైపు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండమని అంబటికి నేరుగానే చెప్పేశారట.