`గేమ్ ఛేంజర్‌` లో హైలైట్‌గా ఆ సీన్‌.. జగన్ – వైఎస్‌ఆర్ మ‌ధ్య జ‌రిగిందా?

admin
Published by Admin — January 10, 2025 in Movies
News Image

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సోలోగా న‌టించిన `గేమ్ ఛేంజర్‌` నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. శంక‌ర్ డైరెక్ట్ చేసిన ఈ పొలిటిక‌ల్ యాక్ష‌న్ డ్రామా లో చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేశాడు. కియారా అద్వానీ, అంజ‌లి హీరోయిన్లుగా న‌టిస్తే.. ఎస్. జె. సూర్య, జ‌య‌రామ్‌, శ్రీకాంత్, సముద్రఖ‌ని త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించారు. అనుకున్న దానికంటే భారీ అంచనాలతో థియేట‌ర్స్ లోకి వ‌చ్చిన గేమ్ ఛేంజ‌ర్ కు మెగా ఫ్యాన్స్ పాజిటివ్ గా రెస్పాన్స్ వస్తుండ‌గా.. మ‌రోవైపు సాధార‌ణ ప్రేక్ష‌కుల నుంచి యావరేజ్ టాక్ వినిపిస్తుంది.

వ్య‌వ‌స్థ, ప్ర‌క్షాళన చుట్టూ గేమ్ ఛేంజ‌ర్‌ క‌థ సాగుతుంది. ఓ యంగ్ ఐఏఎస్ ఆఫీసర్​ అలాగే పొలిటికల్ లీడర్​కు మధ్య సాగే యుద్ధమే ఈ సినిమా. హీరోగా రామ్ చరణ్, విల‌న్ గా ఎస్‌.జె. సూర్య‌ల‌ యాక్టింగ్ సినిమా మొత్తానికి ప్ర‌ధాన బ‌లంగా నిలిచింద‌ని అంటున్నారు. ముఖ్యంగా అప్ప‌న్న పాత్ర‌లో చ‌ర‌ణ్ అవార్డ్ విన్నింగ్ ప‌ర్ఫామెన్స్ ఇచ్చాడ‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. గేమ్ ఛేంజ‌ర్ లోని ఓ సీన్ ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది.

మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కొన్ని స‌న్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయ‌ని గ‌తంలో ప్ర‌చారం జ‌రిగింది. అందుకు త‌గ్గ‌ట్లుగానే విల‌న్ గా బొబ్బిలి మోపిదేవి పాత్ర‌ను పోషించిన ఎస్‌.జె. సూర్య ప‌దే ప‌దే ఈ రాష్ట్రానికి 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండడం నా కల అంటూ చెబుతారు. సీఎంగా ఉన్న‌ప్పుడు జ‌గ‌న్ సైతం ఇదే విధంగా 30 ఏళ్లు వైసీపీనే అధికారంలో ఉంటుంద‌ని అనేవారు.

Recent Comments
Leave a Comment

Related News