ముందుగా రింకూ సింగ్ విషయానికి వస్తే.. ఐపీఎల్ ద్వారా ఈ యువకెరటం తెర మీదకు రావటమే కాదు.. తన దూకుడు ఆటతో భారీగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు.ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదిన వైనంతో ఓవర్ నైట్ స్టార్ గా అవతరించాడు. తన ఆటతీరుతో టీమిండియాలో చోటు దక్కించుకున్న రింకూ.. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన రింకూను ఐపీఎల్ 2025కు ముందు కోల్ కతా నైట్ రైడర్స్ రూ.13 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకోవటం సంచలనంగా మారింది.
లోక్ సభలో రెండో పిన్న వయస్కురాలిగా నిలిచిన ఆమె.. బీజేపీ అభ్యర్థిపై 35వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాజకీయ నేపథ్యం ఉన్నకుటుంబం నుంచి వచ్చిన ప్రియా సరోజ్ తండ్రి తుఫానీ సరోజ్. ప్రస్తుతం ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభా స్థానం నుంచి ఆమె తండ్రి మూడు సార్లు ఎంపీగా గెలిచిన ట్రాక్ రికార్డు ఉంది. 1999, 20024, 2009లో ఆయన హ్యట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రియా సరోజ్ విద్యార్హతల విషయానికి వస్తే ఢిల్లీ వర్సిటీలో లా చదివిన ఆమె.. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పని చేశారు.
వీరిద్దరికి పెళ్లి విషయంపై చర్చకు కారణం.. రింకూ సింగ్ తన సోదరితో కలిసి దిగిన ఫోటోలే. ఆ ఫోటోల బ్యాక్ గ్రౌండ్ లో డెకరేషన్ చేసి ఉండటంతో రింకూ ఎంగేజ్ మెంట్ జరిగిందా?అన్నది ప్రశ్నగా మారింది. అదే సమయంలో ప్రియా సరోజ్ తో ఎంగేజ్ మెంట్ జరిగిందన్న ప్రచారం రావటంతో.. ఆ సందర్భంగానే తన సోదరితో ఫోటోలు దిగి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా వస్తున్న వార్తల నేపథ్యంలో వీరిద్దరూ స్పందిస్తారేమో చూడాలి.