ఆత్మీయ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. విగ్రహ ప్రతిష్ట మహోత్సవం విజయవంతంగా జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం చాలా కళగా ఉంది. రికార్డ్ సమయంలో విగ్రహ ఏర్పాటుకు కృషిచేసిన ప్రతిఒక్కరికి అభినందనలు. అందరం కలిసికట్టుగా పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించారు.
కార్యక్రమం విజయవంతం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. యువగళం పాదయాత్ర సమయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్వగ్రామానికి వెళ్లి స్ఫూర్తి పొందాను. పొట్టి శ్రీరాములు చరిత్ర, త్యాగనిరతిని భావితరాలకు తెలియజేయాలి. ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆయన త్యాగం, పోరాటం వెలకట్టలేనివి.
2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా ఏపీని తీర్చిదిద్దుతాం. మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. 12 నెలల్లోనే స్మృతివనం, ఫోటో గ్యాలరీ, మ్యూజియం, మినీ థియేటర్, ఆడిటోరియం, స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ నిర్మాణం పూర్తిచేయాలి. రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా మంత్రి భరోసా ఇచ్చారు. ఆత్మీయ విందు సమావేశం ఆద్యంతం ఆహ్లాదభరిత వాతావరణంలో జరిగింది. మంత్రి లోకేష్ ప్రతిఒక్కరినీ పేరుపేరునా పలకరించారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు.
ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, అమరజీవి పొట్టి శ్రీరాములు మనవరాలు రేవతి తంగుడు, అనురాధ దేవకి, మునిమనవరాళ్లు, మునిమనవళ్లు వసుధ, అమర్, అజయ్, కుందా ప్రతిభ, కుందా ప్రతాప్ తో పాటు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.