ఒక్క రోజే 15 మీటింగ్ లు..దావోస్ లో చంద్రబాబు బిజీ బిజీ!

admin
Published by Admin — January 21, 2025 in Politics
News Image

ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దావోస్ వెళ్లిన చంద్రబాబు, మంత్రుల బృందం పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయింది. ఈ నేపథ్యంలోనే నేడు 15కు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి భేటీల‌లో పాల్గొనబోతున్నారు. గ్రీన్ హైడ్రోజన్-గ్రీన్ మాన్యుఫాక్చరింగ్, నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్, ఎనర్జీ ట్రాన్సిషన్, బ్లూ ఎకానమీ సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలకు చంద్రబాబు హాజరుకానున్నారు. అంతేకాదు, సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాన్ కిమ్ యాంగ్, యూఏఈ ఆర్థిక మంత్రితో కూడా చంద్రబాబు భేటీ కానున్నారు.

వెల్స్‌పన్ చైర్మన్ బీకే గోయింకా, ఎల్జీ కెమ్ సీఈఓ షిన్ హక్ చియోల్, కార్ల్స్‌బెర్గ్ సీఈఓ జాకబ్ ఆరుప్ ఆండర్సన్, టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, వాల్‌మార్ట్ ప్రెసిడెంట్, సీఈఓ కాత్ మెక్‌లే, సిస్కో సీఈఓ చుక్ రాబిన్స్, కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ తదితరులతో పెట్టుబడులపై చంద్ర‌బాబు చర్చించనున్నారు. బ్లూమ్‌బెర్గ్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలన చంద్రబాబు వివరించనున్నారు

దిగ్గజ పాారిశ్రామిక వేత్త ఆర్సెలార్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీమిత్తల్‌తో చంద్రబాబు, లోకేశ్ భేటీ అయ్యారు. ఏపీలోని భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటు పెట్టుబడులు పెట్టాలని లక్ష్మీ మిత్తల్‌ను లోకేశ్ ఆహ్వానించారు. ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటును పరిశీలించాలని కూడా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. హెచ్‌పీసీఎల్ – మిత్తల్ సంయుక్త భాగస్వామ్య సంస్థ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.3,500 కోట్లతో 2 జి డబ్ల్యు సామర్థ్యం గల సోలార్ సెల్ తయారీ ప్లాంట్‌ను భారత్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఆ ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని లోకేశ్ కోరారు. ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే సుమారు 2వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

Recent Comments
Leave a Comment

Related News