ఆంధ్రుల కలల రాజధాని అమరావతి(amaravati)కి పట్టిన గ్రహణం ఎట్టకేలకు వీడింది. భవిష్యత్తులో ఏ ముఖ్యమంత్రి కూడా అమరావతి రాజధానిని టచ్ చేయకుండా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చేసిన తీర్మానం నిన్న లోక్ సభలో..నేడు రాజ్యసభ(rajyasabha)లో ఆమోదం పొందింది. ఇక, రాష్ట్రపతి లాంఛనంగా ఆమోద ముద్ర వేయడమే తరువాయి. దీంతో, ఏపీలో కూటమి పార్టీల నేతలు, అమరావతి రైతులు, ప్రజలు, ఎన్నారైలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ రోజు మూజువాణి ఓటుతో ఆ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లు(amaravati bill) ఆమోదం పొందడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మొత్తం 11 పార్టీలకు చెందిన 17 మంది ఎంపీలు ఈ బిల్లుపై చర్చలో పాల్గొన్నారు. 10 పార్టీలకు చెందిన ఎంపీలు ఈ బిల్లుకు మద్దతిచ్చారు.
ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో ప్రజా రాజధానిగా అమరావతి గుర్తుంటుందని ఆయన అన్నారు. అమరావతికి చట్టబద్ధత బిల్లు ప్రవేశపెట్టడాన్ని తెలుగు ప్రజలంతా గర్వంగా భావిస్తున్నారని చెప్పారు. ఏపీ రాజధాని గురించి ప్రజలకు స్పష్టతనిస్తున్నామని అన్నారు.