తన డ్రైవర్ హత్య కేసులో బెయిల్ పై ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇటీవల సాక్షులను బెదిరించారని ఆరోపణలొచ్చాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో అనంత బాబు పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అనంత బాబు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గోదావరి జిల్లాలతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ వెతుకుతున్నారు.
సాక్షులను బెదిరించిన నేపథ్యంలో అనంతబాబుపై బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆ కేసు కొట్టివేలని కోరుతూ ఏపీ హైకోర్టులో అనంత బాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ రద్దు చేయించాలనే ఉద్దేశంతో తప్పుడు కేసు పెట్టారని అనంతబాబు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు
దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తికి నీ మద్దతా? సిగ్గు సిగ్గు జగన్ అని సీఎం చంద్రబాబు విమర్శించారు. దళిత డ్రైవర్‌ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని ఎమ్మెల్సీగా చేశారని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ అతనే సాక్షులను బెదిరించే స్థాయికి వచ్చి, పోలీసులకు అడ్డంగా దొరికాడని చంద్రబాబు ఏకిపారేశారు.