ఇటీవల `క` మూవీతో సూపర్ హిట్ అందుకున్న టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలోనే `దిల్ రూబా` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. విశ్వ కరుణ్ డైరెక్ట్ చేసిన ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీ ఇది. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటించింది. హోలీ పండుగ సందర్భంగా మార్చి 14న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఇందులో భాగంగానే చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది.
అయితే ప్రేక్షకులను ఆకర్షించేందుకు హీరో కిరణ్ అబ్బవరం ఓ క్రేజీ ఆఫర్ ప్రకటించాడు. అదే దిల్ రూబా కథ కనిపెట్టు.. ఫ్రీగా బైక్ పట్టు. అవును, ఈ మూవీ స్టోరీని కనిపెడితే ఉచితంగా బ్రైక్ ఇస్తానంటున్నాడు కిరణ్ అబ్బవరం. దుల్ రూబా మూవీలో కిరణ్ కోసం ఆర్ట్ డైరెక్టర్ కష్టపడి స్పెషల్ గా ఒక బైక్ కస్టమైజ్ చేశారు. మార్కెట్ లో ఆ బైక్ దొరకదు. అయితే ఆ స్పెషల్ బైక్ ను ఆడియెన్స్ ఇచ్చేయాలని చిత్రబృందం నిర్ణయించింది.
ఇప్పటివరకు బయటకు వచ్చిన పాటలు, టీజర్ మరియు ఈవెంట్స్‌లో చిత్ర యూనిట్ మాట్లాడిన మాటల ఆధారంగా దిల్ రూబా ప్లాట్ ను గెస్ చెయ్యాలి. మోస్ట్ క్రియేటివ్ గా ఎవరు గెస్ చేస్తారో వాళ్ళకి ఈ బైక్ ని ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఇచ్చేస్తానని కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అంతేకాకుండా బైక్ గెలుచుకున్న వారితో కలిసి అదే బైక్ పై ఫస్ట్ డే ఫస్ట్ షో దిల్ రూబా సినిమా చూస్తానని కూడా తెలిపాడు.
అమ్మయిలు, అబ్బాయిలు ఎవరైనా సరే సినిమా స్టోరీని గెస్ చెయ్యొచ్చని కిరణ్ చెప్పడంతో.. నెటిజన్లు బైక్ గెలుచుకునేందుకు పోటీ పడుతున్నారు. కాగా, దిల్ రూబా సినిమా శివమ్ సెల్యులాయిడ్స్, ఏ యూడ్లీ ఫిల్మ్ బ్యానర్లపై నిర్మితమైంది.పాపులర్ మ్యూజిక్ లేబుల్ సారెగమ ఫస్ట్ టైమ్ ఈ మూవీతో నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు. సామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తున్నాడు.