చంద్ర‌బాబు కూడా షాక్‌.. ఈ వ్య‌క్తి జీత‌మెంతో తెలుసా?

admin
Published by Admin — February 02, 2025 in Politics
News Image

ఓ ఐటీ ఉద్యోగి జీత‌మెంతో తెలిసి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూడా షాక్ అయ్యారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి మండలం లో ఈ ఇంట్రెస్టింగ్ సీన్ చోటుచేసుకుంది. జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శ‌నివారం అన్న‌మ‌య్య జిల్లాకు వెళ్లారు ముఖ్య‌మంత్రి. రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి మండలంలో ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీతో పాటు ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో చంద్ర‌బాబు పాల్గొన్నారు. అలాగే ఈ సందర్భంగా ఐటీ ఉద్యోగులతో చంద్ర‌బాబు కాసేపు చిట్ చిట్ చేశారు.

ఈ క్ర‌మంలోనే ఓ టెకీ త‌న‌ను తాను ప‌రిచ‌డం చేసుకున్నాడు. త‌న పేరు యువరాజు యాదవ్ అని, బెంగళూరులోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగినని, ప్రస్తుతం వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నానని తెలిపాడు. కటింగ్స్ పోగా నెలకు వచ్చే జీతం రూ. 6.37ల‌క్ష‌లు.. ఏడాదికి రూ. 93 లక్షలు అని యువ‌రాజు యాద‌వ్ చెప్ప‌డంతో.. చంద్ర‌బాబుతో స‌హా అక్క‌డున్న వారంతా షాకైపోయారు.

వెంట‌నే చంద్ర‌బాబు క‌ల‌గ‌జేసుకుని ఎంత వస్తుంది మరోసారి చెప్పమ్మా అన‌గా.. యువ‌రాజు యాద‌వ్ ఏడాదికి రూ. 93 ల‌క్ష‌లు ప్యాకేజీ సార్ అని బ‌దులిచ్చాడు. దాంతో `ఇంటి దగ్గర కూర్చుని సంవత్సరానికి 93 లక్షలు సంపాదిస్తున్న యువరాజ్ కి గట్టిగా చప్పట్లు.. ఐయామ్ ఫ్రౌడాఫ్ హిమ్` అంటూ చంద్ర‌బాబు ప్ర‌శించారు. అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉన్న‌ అసలు ర‌చ్చ ఆ త‌ర్వాత మొద‌లైంది.

యువరాజ్ అబద్దాలు చెబుతున్నాడని సోష‌ల్ మీడియాలో కొంద‌రు అత‌న్ని ట్రోల్ చేయ‌డం షురూ చేశారు. దాంతో యువ‌రాజ్ ట్రోల‌ర్స్ కు గ‌ట్టి జ‌వాబు ఇచ్చాడు. తాను ఓ ప్ర‌ముఖ‌ కంపెనీకి జనరల్ మేనేజర్ హోదాలో ఉన్నాన‌ని.. త‌న‌కు 14 ఏళ్ల అనుభ‌వం ఉంద‌ని యువ‌రాజ్ పేర్కొన్నారు. సీఎం మీటింగ్ లో త‌న‌కు ఏడాదికి రూ. 93 లక్షల ఫ్యాకేజీ అని చెప్పింది అక్ష‌రాల నిజ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. తాను 30 శాతం ట్యాక్స్ కడుతున్నట్లు కూడా యువ‌రాజ్ ఆధారాలు చూపించాడు. అన‌వ‌స‌రంగా ట్రోల్స్ చేయొద్దంటూ హెచ్చ‌రించారు.

Recent Comments
Leave a Comment

Related News

Related News

ఏపీలో నమో అంటే నాయుడు మోదీ: లోకేష్ నమో...భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరుకు షార్ట్ కట్. ఆయన అభిమానులు ముద్దుగా మోదీని నమో అని పిలుస్తుంటారు. ప్రపంచ దేశాలలో కూడా నమో బ్రాండ్ కు మంచి గుర్తింపు ఉంది. అదే విధంగా మోదీ సమకాలీకుడైన ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా గ్లోబల్ ఇమేజ్ ఉంది. జాతీయ మీడియాలో చంద్రబాబును నాయుడు అని సంబోధిస్తుంటారు. ఈ క్రమంలోనే ఇకపై ఏపీలో నమో అంటే నాయుడు అండ్ మోదీ అని మంత్రి లోకేష్ కొత్త భాష్యం చెప్పారు. ఈ ఇద్దరు సమర్థ నేతల నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కారు పరుగులు పెడుతోందని లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొత్త నగరాలు నిర్మించిన చరిత్ర ఉందని చెప్పారు. ఆ అనుభవంతోనే అద్భుతమైన అమరావతి నిర్మాణం చేపట్టారని కితాబిచ్చారు. దేశవిదేశాలలో భారీ పెట్టుబడులను ఆకర్షించి చరిత్ర సృష్టిస్తున్నామని తెలిపారు. యుఎస్ – ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్న సందర్భంగా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. బ్రెయిన్ డ్రెయిన్ నుంచి బ్రెయిన్ గెయిన్ చేస్తున్నామని, కేవలం 17నెలల్లో $120 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించామని చెప్పారు. విశాఖలో గూగుల్ $15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టబోతోందని అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్, డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారును చూసి ఏపీలో పెట్టబడులు పెడుతున్నారని చెప్పారు.

Show All
Latest News