సీఎం విజయ్ కు కొత్త తలనొప్పి

admin
Published by Admin — May 20, 2026 in National
News Image

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు, ఆ ఎన్నికల ఫలితాలు కోలీవుడ్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీని తలపించేలా ఉన్న సంగతి తెలిసిందే. టీవీకే అధినేత విజయ్ బల నిరూపణ జరిగే వరకు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ ఏర్పడింది. ఎట్టకేలకు టీవీకేకు సంఖ్యాబలం ఉండడం, అనూహ్యంగా ఏఐడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు విజయ్ కు మద్దతివ్వడంతో టీవీకే సర్కార్ 144 మంది ఎమ్మెల్యేలతో సభలో బలం నిరూపించుకుంది.

చివరి నిమిషంలో విజయ్ కు మద్దతిచ్చిన ఏఐడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలకు కూడా విజయ్ మంత్రి పదవులిస్తారని అంతా భావించారు. అయితే, అనూహ్యంగా ఆ రెబల్స్ కు విజయ్ షాకిచ్చారని తెలుస్తోంది. వారికి మంత్రివర్గంలో చోటు కల్పించబోమని విజయ్ తమతో చెప్పినట్లు టీవీకే మిత్రపక్షం వీసీకే చీఫ్ తిరుమావళన్ చెప్పారు. వారికి మంత్రి పదవులిస్తే టీవీకేకు మద్దతు ఉపసంహరించుకుంటామని విజయ్ కు తాము చెప్పామని ఆయన వెల్లడించారు.

దీంతో, ఆ రెబల్ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించబోమని వీసీకే, లెఫ్ట్ పార్టీలకు విజయ్ స్పష్టం చేశారని తెలుస్తోంది. మరి, మంత్రి పదవులివ్వకపోయినా టీవీకేకు ఆ రెబల్ ఎమ్మెల్యేలు మద్దతు కొనసాగిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ వారు మద్దతు ఉపసంహరించుకుంటే బొటాబొటీ మెజారిటీతో ఉన్న విజయ్ సర్కార్ కు దిన దిన గండం ఖాయం.

Tags
Tvk chief vijay cm vijay aidmk rebel mlas no minister posts
Recent Comments
Leave a Comment

Related News