ట్రాక్ట‌ర్ న‌డిపి..సామాన్యుల‌తో మమేకమైన చంద్రబాబు!

admin
Published by Admin — April 12, 2025 in Politics
News Image

ఏపీలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు త‌న‌కు స‌మాన‌మేన‌ని చెప్పే సీఎం చంద్రబాబు.. తాజాగా సామాన్యుల్లో సామాన్యుడిగా క‌లిసి పోయారు. 74 ఏళ్ల వ‌య‌సులోనూ ఆయ‌న చాలా యాక్టివ్‌గా క‌నిపిస్తున్న విష‌యం తెలి సిందే. యాక్టివ్‌గా క‌నిపించ‌డ‌మే కాదు.. ప‌నితీరులోనూ ఆయ‌న యాక్టివ్ నెస్ పెంచుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లా ఆగిరిప‌ల్లి మండ‌లంలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు వ‌డ్ల‌మాను ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌య్యారు. ఇక్క‌డి వారుఎక్కువ‌గా కుల వృత్తుల‌పై ఆధార‌ప‌డ్డారు.

వీరి నేప‌థ్యాన్ని తెలుసుకున్న చంద్ర‌బాబు .. కుల వృత్తి దారుల‌ను ప్రోత్స‌హించేందుకు త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని చెప్పారు. ఇదేస‌మ‌యంలో స్థానికంగా ఏర్పాటు చేసిన కుల‌వృత్తిదారుల‌కు సంబంధిం చిన స్టాళ్ల‌ను ప‌రిశీలించారు. ఆయా వృత్తి దారుల స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. వారితో మ‌మేక‌మై.. వారి తో క‌లిసి ఆయా ప‌నులు కూడా చేయ‌డం గ‌మ‌నార్హం. ముఖ్య‌మంత్రిగా త‌న హోదాను ప‌క్క‌న పెట్టిన చంద్రబాబు.. కుల వృత్తి దారుల‌తో క‌లివిడిగా వ్య‌వ‌హ‌రించారు.

తొలుత ఓ రైతుకు చెందిన ట్రాక్ట‌ర్‌ను తీసుకుని.. దానిని న‌డిపారు. పొలం దున్నే విధానంలో మెళ‌కువ‌లు పెరిగాయ‌ని.. వాటిని కూడా అందిపుచ్చుకోవాల‌న్నారు. త్వ‌ర‌లోనే రైతుల‌కు అన్న‌దాత సుఖీభ‌వ నిధులు విడుద‌ల చేయ‌నున్న‌ట్టు చెప్పారు. ఇక‌, అదే స్టాల్స్‌లో ఓ మూల ఏర్పాటు చేసిన క‌మ్మ‌రి కుండ‌ల త‌యా రీ కేంద్రానికి వెళ్లిన చంద్ర‌బాబు.. క‌మ్మ‌రి చ‌క్రాన్ని, కుండ‌లు త‌యారు చేసే విధానాల‌ను ప‌రిశీలించారు.

అనంతరం, తానే స్వ‌యంగా చ‌క్రం తిప్పుతూ.. క‌మ్మ‌రుల‌ను ఉత్సాహ‌ప‌రిచారు. దీంతో “చంద్ర‌బాబు చ‌క్రం తిప్పారే!“అనే కామెంట్లు వినిపించాయి. త‌ర‌చుగా చంద్ర‌బాబు కేంద్రంలో చ‌క్రం తిప్పుతా.. రాజ‌కీయంగా చ‌క్రం తిప్పుతా.. అనే కామెంట్లు చేస్తుంటారు క‌దా.. ఇప్పుడు వాటిని ఉద్దేశించి ఈ వ్యాఖ్య‌లు వినిపించ‌డం గ‌మ‌నార్హం.

Recent Comments
Leave a Comment

Related News

Latest News