పవన్ త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు

admin
Published by Admin — July 11, 2026 in Politics
News Image

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా హైదరాబాద్ లో తన 2 భుజాలకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ సర్జరీ విజయవంతంగా ముగిసింది. ఈ నేపథ్యంలోనే పవన్ త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

పవన్ కల్యాణ్‌ 2 భుజాలకు 'రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్' ఉన్నట్లు వైద్యులు కొద్ది రోజుల క్రితం ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రి వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలోనే నేడు 3 గంటల పాటు సర్జరీ చేశారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ఆయన సర్జరీ విజయవంతం కావడం పట్ల జనసైనికులు, కూటమి నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు గుళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

Tags
AP deputy CM Pawan Kalyan surgery speedy recovery cm chandrababu
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News