అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలో స్కైడైవింగ్ సందర్భంగా జరిగిన విషాద ప్రమాదంలో తెలుగు యువకుడు మణి చంద్ర తేజ గడ్డం
(28) మృతి చెందిన వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్ డా. రాజా ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్న వయస్సులోనే ఓ యువకుడు అకాల మరణం చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్న ఆయన, తేజ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ దుర్ఘటనతో తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని, ఈ క్లిష్ట సమయంలో గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ కుటుంబం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని డా. రాజా పేర్కొన్నారు.
"ఒక యువ ప్రాణం ఇలా అకాలంగా కోల్పోవడం అత్యంత విషాదకరం. తేజ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ అపారమైన దుఃఖాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను," అని డా. రాజా తెలిపారు.
ఓం శాంతి.
– డా. రాజా
గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్