బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `ఛావా` తెలుగు ట్రైలర్ వ‌చ్చేసింది!

admin
Published by Admin — March 03, 2025 in Politics, Movies
News Image

ఇటీవ‌ల విడుద‌లైన చారిత్రక యాక్షన్ చిత్రం `ఛావా` బాలీవుడ్ కు ఊపిరి పోసింది. మరాఠా సామ్రాజ్యం రెండవ పాలకుడు ఛ‌త్ర‌ప‌తి శంభాజీ మ‌హారాజ్ జీవిత‌గాథ ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ తెర‌కెక్కిన ఈ సినిమాలో విక్కీ కౌశల్ ప్ర‌ధాన పాత్ర‌ను పోషించ‌గా.. రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా, డయానా పెంటీ ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించారు. మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మించిన ఛావా ఫిబ్రవరి 14న విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది.

బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. ఇప్ప‌టికే రూ. 600 కోట్ల రేంజ్ లో క‌లెక్ష‌న్స్ ను కొల్ల‌గొట్టింది. నార్త్ ప్రేక్ష‌కులు ఛావాకి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుండ‌టంతో.. సౌత్ లో కూడా ఈ చిత్రంపై భారీ బ‌జ్ ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్.. ఛావా తెలుగు డ‌బ్బింగ్ వెర్ష‌న్ ను మార్చి 7న విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది.

ఇందులో భాగంగానే ఛావా తెలుగు ట్రైల‌ర్ ను తాజాగా విడుద‌ల చేశారు. మూడు నిమిషాలు నిడివి ఉన్న ఈ ట్రైల‌ర్ ఆధ్యంతం ఆక‌ట్టుకుంది. ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్, వండ‌ర్ ఫుల్ విజువ‌ల్స్ తో గూస్ బంప్స్ తెప్పించింది. ఛ‌త్ర‌ప‌తి శంభాజీ పాత్ర‌లో విక్కీ కౌశల్ చెల‌రేగిపోయాడు. ప్ర‌స్తుతం ఛావా తెలుగు ట్రైల‌ర్ యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతోంది.

Recent Comments
Leave a Comment

Related News