రఘురామ రెండు కోరికలు జగన్ తీరుస్తారా?

admin
Published by Admin — February 05, 2025 in Politics
News Image

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్‌.. రఘురామ కృష్ణ‌రాజు పంతం ఎలా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. అది ఎన్నిక‌ల‌కు ముందు టికెట్ విషయంలో అయినా.. వైసీపీ ఎంపీగా ఉన్న స‌మ‌యంలో అయినా.. ఆయ‌న అనుకున్న‌ది సాధించారు. కాక‌పోతే.. వాటి సాధ‌న‌లో కొంత క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది. ఇక‌, ఇప్పుడు అధికా రంలోకి రావ‌డం.. డిప్యూటీ స్పీక‌ర్ వంటి కీల‌క‌మైన ప‌ద‌విని సొంతం చేసుకోవ‌డం తెలిసిందే. అయిన‌ప్ప టికీ.. ర‌ఘురామ‌కు రెండు కోరిక‌లు మిగిలిపోయాయి. వాటిని సాధించుకునే దిశ‌గా ఆయ‌న అడుగులు వేస్తున్నారు.

1) త‌న‌ను అక్ర‌మంగా అరెస్టు చేసి.. హింసించిన‌.. ఐపీఎస్ అధికారి, అప్ప‌టి సీఐడీ చీఫ్‌.. సునీల్ కుమా ర్‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డం. 2) వైసీపీ అధినేత, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు జ‌గ‌న్‌ను స‌భ‌ను నుంచి స‌స్పెండ్ చేయ‌డం.. లేదా స‌భ్య‌త్వాన్ని పూర్తిగా ర‌ద్దు చేయ‌డం. ఈ రెండు అంశాల‌ను కూడా ర‌ఘురామ సీరియ‌స్ గానే తీసుకున్నారు. సునీల్ కుమార్‌పై తాను ఫిర్యాదు చేసినా.. ఎందుకు అరెస్టు చేయ‌డం లేద‌ని ఆయ‌న త‌ర‌చుగా ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నారు. దీని వెనుక ఎవ‌రు ఉన్నార‌న్న విష‌యాన్ని కూడా ఆయ‌న ఆరా తీస్తున్నారు.

ఒక‌వైపు ఒత్తిడి పెంచుతూనే, మ‌రోవైపు.. సునీల్ అరెస్టుపై అవ‌స‌ర‌మైతే.. ఆయ‌న హైకోర్టును ఆశ్ర‌యించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. మ‌రి ఆయ‌న ప్ర‌య‌త్నం ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి. ఇక‌, మ‌రో కీల‌క అంశం.. వైసీపీ అధినేత‌ను ప‌ద‌వీచ్యుతుడిని చేయ‌డం. అంటే.. ఉన్న ఎమ్మెల్యే స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయించ‌డం. గ‌త ఎన్నిక‌ల్లో 11 స్థానాల‌కే ప‌రిమిత‌మై.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా కూడా ద‌క్క‌క పోవ‌డంతో జ‌గ‌న్ స‌భ‌కు మొహం చూపించ‌లేక పోతున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను స‌స్పెండ్ చేయాల‌న్న‌ది కొంద‌రు టీడీపీ నాయ‌కులు వాద‌న కూడా. అయితే.. ఇలా చేసేందుకు వ‌రుస‌గా అసెంబ్లీని 60 రోజుల పాటు నిర్వ‌హించి.. జ‌గ‌న్ క‌నుక వ‌రుస‌గా 4 రోజులు కూడా రాక‌పోతే.. ఆ త‌ర్వాత ఆటోమేటిక్‌గా ఆయ‌న‌ను స‌స్పెండ్ చేయ‌డం ద్వారా.. ప‌ద‌వి నుంచి తొల‌గించ‌వ‌చ్చ‌ని ర‌ఘురామ ఐడియా. ఈ ఐడియా గ‌తంలోనూ ఓ ఐపీఎస్ అధికారి.. త‌న ఎక్స్ వేదిక‌గా సూచించారు. అయితే.. అప్ప‌ట్లో ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు ర‌ఘురామ ఈ మంత్ర‌మే జ‌పిస్తున్నారు. మ‌రి ఆయ‌న కోరిక ఏమేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.

Recent Comments
Leave a Comment

Related News