ఆగస్టు 1న ఘనంగా 'సిలికానాంధ్ర' రజతోత్సవ సంబరాలు!

admin
Published by Admin — July 30, 2026 in Nri
News Image

తెలుగు భాష, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు పాతికేళ్ల క్రితం అమెరికాలో సిలికానాంధ్ర పురుడు పోసుకుంది. ఈ రెండున్నర దశాబ్దాల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ వెనక్కి తగ్గలేదు. ఈ పాతికేళ్ల ప్రయాణంలో సిలికానాంధ్రకు లక్షలాది మంది ప్రవాసాంధ్రులు, ప్రవాస తెలుగు ప్రజలు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలోనే ఆగస్టు1న కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ లో జరగనున్న 'సిలికానాంధ్ర' రజతోత్సవ సంబరాలకు అందరూ ఆహ్వానితులే.

మాతృ భాష తెలుగు, తెలుగు సంస్కృతి, సంప్రదాయం, కళల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన 'సిలికానాంధ్ర' పాతికేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకున్న సందర్భంగా ఘనంగా రజతోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. 'ఒకే వేదిక- అనేక సంప్రదాయాలు-అనంత భవిష్యత్తు' నినాదంతో ఈ వేడుకలు జరగబోతున్నాయి. శోభా యాత్రం, కుంభ హారతి, దక్ష యాగం, శతక సంఖ్యా వచనం, సంగీతామృత వర్షిణి, లయామృత వర్షిణి, కూచిపూడి నాట్యమండలి వర్షిణి, జానపద జాతర, లలిత గీతామృత వర్షిణి, వందే భారతం వంటి అనేక సంప్రదాయ కళారూపాలు ఈ వేడుకల్లో ప్రదర్శించబోతున్నారు. తెలుగు సంస్కృతి, సంగీతం, నృత్యం, సాహిత్యం అన్నీ కలగలిపి కన్నుల విందు చేయనున్నాయి. ఈ వేడుకలకు సంబంధించిన మరిన్ని వివరాలు కోసం సిలికానాంధ్ర వెబ్ సైట్ ను సందర్శించండి.

News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
Tags
silikanandhra silverjubilee celebrations
Recent Comments
Leave a Comment

Related News

Latest News