మెగాస్టార్ చిరంజీవి కి తాజాగా మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ స్ట్రోంగ్ కౌంటర్ ఇస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల `బ్రహ్మా ఆనందం` ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా హాజరైన చిరంజీవి.. వారసత్వంపై చేసిన కామెంట్స్ వివాస్పదం అయిన సంగతి తెలిసిందే. తన ఇల్లంతా మనవరాళ్లతో నిండిపోయిందని, ఇంట్లో ఉన్నప్పుడు తనకు లేడీస్ హాస్టల్ వార్డెన్‌లాగా అనిపిస్తుందని చిరంజీవి వ్యాఖ్యానించారు. చుట్టూ ఆడపిల్లలే.. తమ లెగసీని కంటిన్యూ చేయడానికి ఈసారికైనా ఒక అబ్బాయిని కనరా అని చరణ్ ను అడుగుతుంటానని చిరు చెప్పుకొచ్చారు.
అయితే ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. మగవారే వారసులా? ఆడపిల్లలు కాదా? అంటే మెగాస్టార్ ను ఇప్పటికే నెటిజన్లు తెగ ట్రోల్ చేసింది. చిరంజీవి లాంటి అత్యున్నత్తస్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. తాజాగా ఇదే విషయంపై భారతదేశ తొలి మహిళా ఐపీఎస్ కిరణ్ బేడీ కూడా రియాక్ట్ అయ్యారు. అబ్బాయిలు కూడా వారుసులే అని నమ్మండి, గుర్తిండి అంటూ కౌంటర్ ఇచ్చారు.
`చిరంజీవి గారు దయచేసి కూతురు కూడా వారసురాలే మరియు ఎందులోనూ తక్కువ కాదు అని నమ్మడం, గ్రహించడం ప్రారంభించండి. ఇది మీరు కుమార్తెను ఎలా పెంచుతారు మరియు ఆమె ఎలా అభివృద్ధి చెందుతుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. తమ కూతుళ్లను పెంచి, పెద్ద చేసి, వారికంటూ ఒక స్థానం కల్పించిన తల్లిదండ్రులను చూసి ఇకనైనా నేర్చుకోండి. ఇప్పటికే ఎందరో కూతుర్లు తమ కుటుంబాలను గర్వపడేలా చేశారు. ఆడ, మగ సమానమని నిరూపించారు.` అంటూ కిరణ్ బేడీ తన అధికారిక ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.