డైరెక్టర్‌గా రామ్ మూవీ.. టైటిల్ లీక్‌..!

admin
Published by Admin — August 26, 2026 in Movies
News Image

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) కెరీర్‌లో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు నటుడిగా వెండితెరపై మాస్, క్లాస్ ప్రేక్షకులను మెప్పించిన రామ్.. ఇప్పుడు మెగాఫోన్ పట్టి దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడుతుండటం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రామ్ డ్యూయల్ రోల్ (యాక్టర్ కమ్ డైరెక్టర్)లో రాబోతున్న 'RAPO23' ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకగా, తాజాగా నెట్టింట ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ తెగ హల్‌చల్ చేస్తోంది.

ఫిలింనగర్ ఇన్‌సైడ్ టాక్ ప్రకారం.. ఈ పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌కు ‘Eka – The Lone Wolf’ (ఏక) అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. రామ్ ఆన్-స్క్రీన్ ఎనర్జీ, మేనరిజమ్‌కు ఈ ‘లోన్ వోల్ఫ్’ కాన్సెప్ట్ పక్కాగా సరిపోతుందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇటీవలే మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సీఎస్ కాంబినేషన్‌ను ప్రకటిస్తూ విడుదల చేసిన స్పెషల్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ టైటిల్ లీక్ అవ్వడంతో సోషల్ మీడియాలో 'RAPO23' ప్రచారం జోరందుకుంది.

ఈ భారీ ప్రాజెక్ట్‌ను ‘రాపో సినిమాటిక్’ (RaPo Cinematic) బ్యానర్‌పై కృష్ణ పోతినేని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. కేవలం కథే కాకుండా సాంకేతికంగానూ సినిమాను నెక్స్ట్ లెవెల్‌లో నిలబెట్టేందుకు టాప్ టెక్నీషియన్లను రంగంలోకి దించారు. విజ్యువల్ మ్యాజిక్ కోసం ప్రముఖ సినిమాటోగ్రఫర్ తిరు పనిచేస్తుండగా, హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్ డిజైన్ చేసేందుకు స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

లవర్ బాయ్‌గా కెరీర్ ప్రారంభించి, మాస్ యాక్షన్ హీరోగా తనకంటూ ఒక బలమైన బ్రాండ్‌ను సొంతం చేసుకున్న రామ్(Ram).. ఇప్పుడు దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరి నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ ‘ఏక’ టైటిల్‌పై రామ్ టీమ్ ఎప్పుడు అధికారికంగా ముద్ర వేస్తుందో చూడాలి.

 

Tags
RAPO23 Ram Pothineni Eka Eka The Lone Wolf Tollywood RaPo Cinematic Telugu Cinema
Recent Comments
Leave a Comment

Related News