మోడీకి జ‌గ‌న్ లేఖ‌.. విష‌యం ఏంటంటే!

admin
Published by Admin — March 22, 2025 in Politics
News Image

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి.. వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ తాజాగా నాలుగు పేజీల లేఖ సంధించా రు. లోక్‌సభ లేదా రాజ్యసభలో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండే విధంగా రాబోయే డీలిమిటే షన్ కసరత్తు నిర్వహించాలని కోరారు. జగన్ ఆదేశాల మేరకు, వైఎస్‌ఆర్‌సిపి పార్లమెంటరీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి.. డీఎంకే పార్టీ నాయకులకు అదే లేఖను పంపారు. డీలిమిటేషన్ ప్రక్రియలో న్యాయమైన, సమతుల్య విధానం అవసరాన్ని జ‌గ‌న్‌ నొక్కి చెప్పారు

కాగా.. డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ ఇంకా ప్రారంభంకాక‌పోయినా.. త‌మ‌కు… ద‌క్షిణాది రాష్ట్రాల‌కు కూడా ఆందో ళ‌న‌గా ఉంద‌ని జ‌గ‌న్ త‌న‌లేఖ‌లో స్ప‌ష్టం చేశారు. డీలిమిటేష‌న్ ద్వారా ద‌క్షిణాది రాష్ట్రాల‌కు పార్ల‌మెంటు స్థానాలు త‌గ్గే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంద‌ని తెలిపారు. ఈ విష‌యంపై ప్ర‌భుత్వం క్లారిటీ ఇ వ్వాల్సి ఉంద‌న్నారు. ముఖ్యంగా జ‌నాభా ప్రాతిప‌దిక‌న చేప‌ట్టే పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ పున‌ర్విభ‌జన తో ద‌క్షిణాది రాష్ట్రాలు న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంద‌న్న ఆందోళ‌న‌లో వాస్త‌వం ఉంద‌న్నారు.

గ‌త 15 ఏళ్లుగా జ‌నాభా నియంత్ర‌ణ‌లో ద‌క్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయ‌ని జ‌గ‌న్ పేర్కొన్నా రు. ఇదేస‌మ‌యంలో ఉత్త‌రాది రాష్ట్రాల్లో జ‌నాభా నియంత్ర‌ణ ఆశించిన విధంగా జ‌ర‌గ‌లేద‌న్నారు. దీంతో డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ‌లో రాష్ట్రాలు న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంద‌న్నారు. దీనిని గ‌మ‌నంలో పెట్టుకుని.. నిర్ణ‌యం తీసుకోవాల‌ని జ‌గ‌న్ ప్ర‌ధాని కి సూచించారు. ద‌క్షిణాది రాష్ట్రాల‌కు అన్యాయం జ‌ర‌గ‌కుండా చూడాల్సిన బాధ్య‌త ప్ర‌ధానిగా త‌మ‌పై ఉంద‌ని పేర్కొన్నారు.

డుమ్మా..

మ‌రోవైపు త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ నిర్వ‌హించిన కీల‌క అఖిల ప‌క్ష స‌మావేశానికి జ‌గ‌న్ డుమ్మా కొట్టారు. ఆయ‌న కానీ.. ఆయ‌న పార్టీ త‌ర‌ఫున కానీ.. ఎవ‌రినీ ఈ స‌మావేశానికి పంపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం చెన్నైలో ఈ అఖిల ప‌క్ష స‌మావేశం జ‌రుగుతున్న క్ర‌మంలోనే ప్ర‌ధానికి జ‌గ‌న్ లేఖ రాయ‌డంవిశేషం.

Recent Comments
Leave a Comment

Related News

Latest News