8 ఏళ్లలో రూ. 53 ల‌క్ష‌ల సంపాద‌న‌.. ఈ స్విగ్గీ బాయ్ స్టోరీ తెలిస్తే షాకే.!

admin
Published by Admin — September 21, 2026 in National
News Image

ఇప్పుడు చెప్పేది రీల్ స్టోరీ కాదు రియల్ స్టోరీ. డెలివరీ బాయ్(Delivery Boy) అన్నంతనే ఒకలాంటి చిన్నచూపు.. అదేమీ పెద్ద పనేమీ కాదన్నట్లుగా భావించేటోళ్లు తక్కువ ఉండరు. కానీ.. అత్యంత కఠినమైన ఉద్యోగాల్లో డెలివరీబాయ్ పని ఒకటి. ఇంత కష్టపడినా.. సంపాదన అంతంతమాత్రమే. అయితే.. ఇలాంటి వాటికి భిన్నంగా చెన్నైకు చెందిన స్విగ్గీ డెలివరీ బాయ్ సక్సెస్ స్టోరీ గురించి తెలిస్తే మాత్రం.. రంగం ఏదైనా ఫోకస్ గా పని చేస్తే ఫలితాలు అదిరేలా ఉంటాయన్న విషయం అర్థమవుతుంది.

చెన్నై(Chennai)కు చెందిన శంకర్ స్విగ్గీ డెలివరీ బాయ్ పని చేస్తుంటాడు. కుటుంబంతో  సమయాన్ని గడుపుతూ.. తనకు నచ్చిన వేళల్లో పని చేసుకుంటూ సాగిన శంకర్ కు తన పిల్లల్ని బాగా చదివించాలన్న కోరిక ఎక్కువ. తను చదువుకున్న దానికి మంచి జాబ్ దొరకటం కష్టమైన వేళ.. స్విగ్గీ డెలివరీ బాయ్ గా ఎనిమిదేళ్ల క్రితం పని మొదలుపెట్టాడు. చేసే పని ఎలాంటిదైనా.. ఫోకస్ గా చేయటం.. కష్టపడటం లాంటి వాటితో ఉత్తమ ఫలితాల్ని సొంతం చేసుకోవచ్చన్న సూత్రాన్ని అతనను నమ్ముతాడు. అందుకే.. స్విగ్గీ డెలివరీ బాయ్ గా తనకు లభించిన అవకాశాన్ని వినియోగించుకుంటూ పని చేసేవాడు.

ఒత్తిళ్లకు గురి కాకుండా.. తనకు వీలైన సమయంలో పని చేస్తూ వెళ్లిన అతను.. ఎనిమిదేళ్ల వ్యవధిలో ఏకంగా రూ.53 లక్షలు సంపాదించిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఎనిమిదేళ్లలో తన సంపాదన కారణంగా తనకున్న ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోవటమే కాదు.. ఆర్థికంగా సెటిల్ అయినట్లు చెప్పాడు. ప్రస్తుతం చెన్నై శంకర్(Shankar) స్టోరీని స్విగ్గీ తన ఉద్యోగులకు చెబుతోంది. డెలివరీ జాబ్ ను ఎనిమిదేళ్లు నాన్ స్టాప్ గా కొనసాగించటం అంత తేలికైన పని కాదు. కానీ.. అలా చేస్తే.. ఫలితాలు సైతం బాగుంటాయన్న దానికి శంకర్ ఉదంతం ఒక చక్కటి ఉదాహరణగా చెబుతున్నారు. పట్టుదల.. కష్టపడే తత్త్వంతో ఏ రంగంలో అయినా విజయవంతం కావొచ్చన్న మాటకు శంకర్ నిలువెత్తు రూపంగా నిలుస్తాడు. కాదంటారా?

Tags
Swiggy Delivery Boy Viral Story Chennai Swiggy Boy Shankar
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News