చంద్ర‌బాబు స్ట్రాట‌జీ వైసీపీకి అర్ధం కావ‌ట్లేదా ..!

admin
Published by Admin — April 19, 2025 in Politics, Andhra
News Image

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏప‌ని చేసినా.. చాలా దూర దృష్టితో ఆలోచ‌న చేస్తారు. ఈ విష‌యంలో తిరుగులే దు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం చంద్ర‌బాబుపై మ‌చ్చ‌లు మ‌ర‌క‌లు అంటించేందుకు ప్ర‌య‌త్నించి.. అనేక విష‌యాల‌పై భూత‌ద్దం పెట్టుకుని మ‌రీ వెతికింది. కానీ.. 2014-19 మ‌ధ్య ఎలాంటి త‌ప్పులు దొర‌క‌లేదు రాజ‌ధాని భూముల విష‌యం నుంచి ఫైబ‌ర్ నెట్ వ‌ర‌కు అనేక విష‌యాల‌ను తెర‌మీదికి త‌చ్చారు. కానీ, ఎక్క‌డా ఎలాంటి త‌ప్పులూ దొర్ల‌లేద‌నిసుప్రీంకోర్టు చెప్పింది.

ఇక‌, ఇప్పుడు కూడా.. అదే ప‌నిగా వైసీపీ బుర‌ద‌జ‌ల్లుడు రాజ‌కీయాలు చేస్తోంది. కానీ,.. ఈ క్ర‌మంలో చంద్ర బాబు దూర‌దృష్టిని.. ఆయ‌న త‌పిస్తున్న 2047 విజ‌న్‌ను అర్ధం చేసుకోలేక పోతున్నారు. స‌హ‌జంగా ఒక వ్యాపారం చేయాల‌ని అనుకునే వారు.. ముందుగా ఉచితాలు ప్ర‌క‌టిస్తారు. ఆఫ‌ర్ల పేరుతో వినియోగ‌దారుల ను ఆక‌ట్టుకుంటారు. కొన్నాళ్ల‌కు అల‌వాటు ప‌డిన‌ త‌ర్వాత వ్యాపార ల‌క్ష‌ణం ఎలానూ తెర‌మీదికి తెస్తారు. ఇలానే.. చంద్ర‌బాబు కూడా.. కొన్ని సంస్థ‌ల విష‌యంలో రాజీ ప‌డుతున్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు.. టీసీఎస్ కంపెనీకి విశాఖ‌లో 21.6 ఎక‌రాల భూమిని కేటాయించారు. దీనిని ఎక‌రాల‌కు రూ. 0.99 పైస‌ల‌కే కేటాయించారు. అదేస‌మ‌యంలో ఉర్సా అనే మ‌రో కంపెనీకి కూడా.. 60 ఎక‌రాల భూమి ని కేటాయించారు. ఇది కూడా రూ.0.99 పైస‌ల‌కే ఇచ్చారు. దీనిని త‌ప్పుప‌డుతూ.. వైసీపీ పెద్ద యాగీ చేస్తోంది. ప్ర‌స్తుతం ఏపీకి పెట్టుబ‌డులు వ‌చ్చేందుకు మార్గాలుచాలా త‌క్కువ‌గా ఉన్నాయి. రాజ‌ధానిలేదు. పైగా.. ఎప్పుడు ఎలాంటి రాజ‌కీయాలు ఉంటాయో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

ఈ నేప‌థ్యంలో ఎలాగోలా పెట్టుబ‌డులు పెట్టేవారిని ముందుకు ఆహ్వానిస్తే.. త‌ర్వాత‌.. రాష్ట్రానికి రాక‌పోక లు పెరుగుతాయి. త‌ద్వారా.. మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న జ‌రుగుతుంది. ఇదే జ‌రిగితే క‌రెన్సీ లావాదేవీలు పెరిగి.. ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు మెరుగు ప‌డ‌తాయి. అనంత‌రం.. మ‌రిన్నికంపెనీలు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. అప్పుడు రాష్ట్రం ప్ర‌త్యేక గ‌మ్య స్థానంగా మారుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు గుజ‌రాత్, మ‌హారాష్ట్ర‌ల మాదిరిగా. అక్క‌డ కూడా తొలినాళ్ల‌లో ఇలానే జ‌రిగింది. ఈ చిన్న లాజిక్‌ను వైసీపీ మ‌రిచి పోయి.. చంద్ర‌బాబుపై యాగీ చేయ‌డం స‌రికాద‌ని అంటున్నారు పారిశ్రామిక వేత్త‌లు.

Tags
cm chandrababu's strategy ex cm jagan TDP ycp
Recent Comments
Leave a Comment

Related News