క్రమశిక్షణ అంటేనే టీడీపీ..జీవీ రెడ్డి రాజీనామా ఆమోదం!

admin
Published by Admin — February 24, 2025 in Politics, Andhra
News Image

ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి చేసిన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వారం రోజు లుగా `ఏపీ ఫైబ‌ర్ నెట్‌` కార్పొరేష‌న్‌లో జ‌రుగుతున్న వివాదానికి నేటితో తెరపడినట్లయింది. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన అవినీతి, అక్ర‌మాల‌ను జీవీ రెడ్డి వెలికి తీసిన మాట వాస్త‌వం. అయితే, సంస్థ‌ను అవినీతి కూపంగా మార్చారంటూ.. ఐఏఎస్ అధికారుల‌పైనా జీవీ రెడ్డి నిప్పులు చెరిగారు. ఐఏఎస్ అధికారి, ఫైబ‌ర్ నెట్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ దినేష్ కుమార్‌పై ‘రాజ‌ద్రోహం’ వంటి ఆరోప‌ణ‌లు చేశారు.

దీంతో సీఎం చంద్ర‌బాబు ఎంట్రీ ఇచ్చి.. జీవీ రెడ్డికి క్లాస్ పీకారు. స‌ర్దుకు పోవాలని సూచించారు. స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసుకోవాల‌ని సూచించారు. ప్రెస్ మీట్ లేదా.. నోటీసు ద్వారా.. ‘రాజద్రోహం’ ఆరోప‌ణ‌లు వెన‌క్కి తీసుకోవాల‌ని సూచించారు. కానీ, జీవీ రెడ్డి మాత్రం దినేశ్ కుమార్ పై చేసిన ఆరోప‌ణ‌ల‌ను వెన‌క్కి తీసుకొనేందుకు సిద్ధంగా లేరు. చంద్రబాబు చెప్పినా జీవీ రెడ్డి వినలేదు. దీంతో, హర్ట్ అయిన జీవీ రెడ్డి రాజీనామా చేశారు. కానీ, పార్టీ అధినేత చంద్రబాబు మాటను జవదాటారు.

ఈ క్రమంలోనే ఫైబర్ నెట్ లో వివాదంపై మొత్తం నివేదిక చంద్రబాబుకు అందింది. ఈ క్రమంలోనే ఫైబర్ నెట్ ఎండి దినేష్ కుమార్ ను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దినేష్ కుమార్ కు జీఎడికి రిపోర్ట్ చేయాలని అదేశాలు జారీ చేశారు. అదే సమయంలో జీవీ రెడ్డి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది.

ఈ క్రమంలోనే పార్టీలో అయినా ప్రభుత్వంలో అయినా క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తామని టీడీపీ పెద్దలు మరోసారి రుజువు చేశారు. టీడీపీ అంటేనే క్రమ శిక్షణ అని, ఎవరైనా సరే దానికి కట్టుబడి ఉండాలని ఈ ఉదంతంతో మరోసారి చాటి చెప్పారు. క్రమ శిక్షణతో ఉంటే పార్టీలో ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని, కానీ, పార్టీ లైన్ దాటితే మాత్రం పార్టీ హైకమాండ్ సహించబోదని మరోసారి ప్రూవ్ అయింది.

Tags
ap fiber net chariman gv reddycm chandrababu discipline
Recent Comments
Leave a Comment

Related News