ఏపీ బ‌డ్జెట్ స‌మ‌గ్ర స్వ‌రూపం ఇదీ..!

admin
Published by Admin — February 28, 2025 in Politics, Andhra
News Image

ఏపీ శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రవేశపెట్టారు. రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.48 వేల కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా అంచనా వేశారు. అన్నదాత సుఖీభవ కోసం రూ.6,300 కోట్లు, ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కోసం బడ్జెట్‌లో రూ.6,705 కోట్లు కేటాయించారు.

+ మొత్తం బ‌డ్జెట్‌.. రూ. 3.22 లక్షల కోట్లు..
+ మనబడి పథకానికి రూ.3,486 కోట్లు(పాఠ‌
+ రోడ్ల నిర్మాణం, మరమ్మతులు రూ.4,220 కోట్లు
+ పోర్టులు, ఎయిర్‌పోర్టులు రూ.605 కోట్లు
+ ఆర్టీజీఎస్‌కు రూ.101 కోట్లు
+ ఐటీ, ఎలక్ట్రానిక్స్‌కు రాయితీలు రూ.300 కోట్లు
+ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేష‌న్‌కు రూ.820 కోట్లు
+ సాగునీటి ప్రాజెక్టులకు రూ.11,314 కోట్లు
+ పోలవరం నిర్మాణానికి రూ.6,705 కోట్లు
+ జల్‌జీవన్‌ మిషన్‌కు రూ.2,800 కోట్లు
+ పాఠశాల విద్యాశాఖ-రూ.31,806 కోట్లు
+ వైద్య ఆరోగ్య శాఖ-రూ.19,265 కోట్లు
+ పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ-రూ.18,848 కోట్లు
+ జలవనరుల శాఖ-రూ.18,020 కోట్లు
+ పురపాలక శాఖ-రూ.13,862 కోట్లు
+ ఇంధన శాఖ-13,600 కోట్లు
+ రవాణాశాఖ-రూ.8,785 కోట్లు
+ వ్యవసాయశాఖ-రూ.11,632 కోట్లు

Tags
all sectors AP Budget 2025-26 ap finance minister payyavula keshav
Recent Comments
Leave a Comment

Related News