ప్ర‌జా సంక్షేమానికి భారీ కేటాయింపులు!

admin
Published by Admin — February 28, 2025 in Politics, Andhra
News Image

కూట‌మి ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌కుముందు ఇచ్చిన సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల అమ‌లుకు తాజా బ‌డ్జెట్‌లో భారీ కేటాయింపులు చేసింది. ఒక‌వైపు ఆర్థిక ప‌రిస్థితి బాగోపోయినా.. ప‌థ‌కాల‌కు నిధులు కేటాయించ‌డం ద్వా రా.. త‌మ నిబద్ధ‌త‌ను చాటి చెబుతున్న‌ట్టు మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ బ‌డ్జెట్ ప్ర‌సంగంలో పేర్కొన్నారు. ఆయా ప‌థ‌కాల ద్వారా.. స‌మాజంలోని పేద‌లకు మేలు చేయాల‌న్న ఏకైక ఆకాంక్ష‌తో ముందుకు సాగుతున్నామ‌ని చెప్పారు.

ఇవీ.. సంక్షేమానికి కేటాయింపులు..

+ NTR భరోసా పెన్షన్‌ రూ.27,518 కోట్లు
+ ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు(చేతి వృత్తుల‌ను ప్రోత్స‌హించేందుకు)
+ తల్లికి వందనం పథకానికి రూ.9,407 కోట్లు(త‌ల్లికి రూ.15000 చొప్పున‌)
+ దీపం 2.O పథకానికి రూ.2,601 కోట్లు(ఉచిత గ్యాస్ సిలిండెర్లు ఏటా మూడు)
+ బాల సంజీవని(బాలింత‌ల‌కు) పథకానికి రూ.1,163 కోట్లు
+ చేనేత, నాయీబ్రాహ్మణుల ఉచితవిద్యుత్‌కు రూ.450కోట్లు
+ ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్‌షిప్‌లకు రూ.3,377కోట్లు
+ ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్‌కు రూ.400 కోట్లు
+ అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6,300 కోట్లు(రైతుల‌కు ఇన్‌పుట్ స‌బ్సిడీ)
+ ధరల స్థిరీకరణ నిధి రూ.300 కోట్లు(రైతుల‌కు మేలు చేసే ఉద్దేశం)
+ రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన రూ.500 కోట్లు
+ సాంఘిక సంక్షేమం కోసం రూ.10,909 కోట్లు కేటాయింపు
+ బీసీ సంక్షేమం-రూ.23,260 కోట్లు
+ ఆర్థికంగా వెనుకబడినవారి సంక్షేమంకోసం 10,619 కోట్లు

Tags
ap budget huge allotment welfare schemes
Recent Comments
Leave a Comment

Related News