మ‌నోళ్లు ఏం చేశారు? అర్ధ‌రాత్రి చంద్ర‌బాబు స‌మీక్ష‌!

admin
Published by Admin — February 28, 2025 in Politics, Andhra
News Image

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్ తీరుపై టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు స‌మీక్షించారు. గురువారం రాత్రి చాలా పొద్దు పోయిన త‌ర్వాత‌.. ఉండ‌వ‌ల్లిలోని నివాసంలో ఆయ‌న సీనియ‌ర్ నాయ‌కులతో భేటీ అయ్యా రు. వీరిలో ఇద్ద‌రు మంత్రులు కూడా ఉన్నారు. అదేవిదంగా ఉమ్మ‌డి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పోటీ చేసిన ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్ కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఎన్నిక‌ల పోలింగ్ స‌ర‌ళిపై చంద్ర‌బాబు వారిని అడిగి తెలుసుకున్నారు.

రెండు గ్రాడ్యుయేట్ స్థానాల్లోనూ విజ‌యం మ‌న‌దేన‌ని ఈ సంద‌ర్భంగా కూట‌మి మంత్రులు చెప్పారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు అస‌లు పోలింగ్ స‌ర‌ళి ఎలా ఉంద‌ని.. అంద‌రూ స‌హ‌క‌రించారా? లేదా? అని పార్టీ నాయ‌కులు, క్షేత్ర‌స్థాయి నేత‌ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు.. తాను కొంద‌రికి బాధ్య‌త‌లు అప్ప‌గించాన‌ని గుర్తు చేసిన సీఎం.. వాటిని వారు ఎంత వ‌ర‌కు నెర‌వేర్చార‌ని ప్ర‌శ్నిం చారు. ప‌ట్ట‌భ‌ద్రుల నాడిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నంలో ఎంత వ‌ర‌కు స‌హ‌క‌రించార‌ని ప్ర‌శ్నించారు.

ఇక‌, ఓటింగ్ స‌ర‌ళిని కూడా.. చంద్ర‌బాబు స‌మీక్షించారు. ఉత్త‌రాంద్ర‌లో 92 శాతం పోలింగ్ న‌మోదు కావ‌డం.. ఇత‌ర ప్రాంతాల్లో.. త‌క్కువ‌గా న‌మోదు కావ‌డం పై ఆరా తీశారు. ఇలా ఎందుకు జ‌రిగింద‌న్నారు. అయితే.. వైసీపీ సానుభూతిప‌రులు, అనుకూల వ‌ర్గాలు అస‌లు పోలింగ్ కేంద్రాల‌కు రాలేద‌ని.. అందుకే ఓటింగ్ ప‌ర్సంటేజీ త‌గ్గింద‌ని మంత్రి ఒక‌రు చెప్పారు. అయితే.. కూట‌మి ప‌క్షాన ప్ర‌తి ఓట‌రును బూతుకు తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం స‌క్సెస్ అయింద‌న్నారు.

తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఒక‌టి రెండు స‌మ‌స్య‌లు రావ‌డంపై చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ట్టు తెలిసింది. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన కొన్ని వీడియోల‌పైనా ఆయ‌న ప్ర‌శ్నించారు. అయితే.. ఆ వ్య‌వ‌హారాల‌కు కూట‌మికి సంబంధం లేద‌ని, స్వ‌తంత్ర అభ్య‌ర్థులు డ‌బ్బులు పంచిన‌ట్టు పోలీ సులు చెబుతున్నార‌ని మంత్రి తెలిపారు. ఇక‌, కౌంటింగ్ జ‌రిగే వ‌ర‌కు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని.. ఎలాంటి త‌ప్పులు చేయ‌ద్ద‌ని చంద్ర‌బాబు సూచించారు.

Tags
cm chandrababu Meeting at midnight mlc elections
Recent Comments
Leave a Comment

Related News