ఇకపై Amaravathi.. కాదు.. Amaravati..!

admin
Published by Admin — April 15, 2026 in Politics
News Image
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంపై కూట‌మి ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌త ఇచ్చింది. అమ‌రావ‌తిని ఆంగ్లంలో సంబోధించేప్పుడు.. అదేవిధంగా రాసేప్పుడు ఎదుర‌వుతున్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని.. దీనికి సంబంధించి తాజాగా జీవోనే పాస్ చేసింది. దీని ప్ర‌కారం.. రాజ‌ధాని `అమ‌రావ‌తి` పేరును ఇక‌పై ఆంగ్లంలో రాసేప్పుడు.. ఉచ్ఛ‌రించేప్పుడు కూడా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని.. పేర్కొంది. ప్ర‌భుత్వం సూచించినట్టుగానే `స్పెల్లింగ్‌` ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది.

దీని ప్ర‌కారం.. Amaravathi.. అనే స్పెల్లింగ్ స‌రికాద‌ని.... Amaravati.. అనేది క‌రెక్ట్ అని ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేసింది. THI  స్థానంలో `TI`గా పేర్కొనాల‌ని తెలిపింది. దీని ప్ర‌కార‌మే ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు, జీవోలు, ఫైళ్లు, ఆదేశాలు, అధికారుల ఉత్త‌ర్వులు.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సాయి ప్ర‌సాద్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్రభుత్వ పరిపాలనలో రాజధాని పేరును ఒకే విధంగా పేర్కొనాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మార్పు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని పేర్కొంది.

ఎందుకు?

ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా రూపు దిద్దుకుంటున్న అమ‌రావ‌తి పేరును విదేశీయులు.. ప్ర‌ధాన పెట్టుబ‌డి దారులు ప‌లికేందుకు ఇబ్బందిగా ఉంది. వాస్త‌వానికి.. ప్ర‌పంచ‌స్థాయి ఆంగ్ల డిక్ష‌న‌రీల్లో తెలుగు ప‌దాల‌ను రాసేప్పుడు..   THI  స్థానంలో `TI`గానే పేర్కొంటారు. కానీ.. కేవ‌లం మ‌న రెండు తెలుగు రాష్ట్రాల్లోనే `తి`ని  `THI` గా పేర్కొంటున్నారు. దీనివ‌ల్ల ప్రొనౌన్సియేష‌న్‌తోపాటు.. ఆంగ్ల ప‌త్రిక‌ల్లోనూ రాసేందుకు ఇబ్బంది ఎదుర‌వుతోంది. పైగా.. ఆంగ్ల అక్ష‌రాల సెంటిమెంటు ప్ర‌కారం కూడా..  THI  స్థానంలో `TI`గా ఉంటేనే బాగుంటుంద‌ని ప‌లువురు సూచించారు ఈ నేప‌థ్యంలోనే ఈ మార్పు చేయ‌డం గ‌మ‌నార్హం.
Tags
Amaravathi name changed Amaravati official g.o
Recent Comments
Leave a Comment

Related News

Latest News