సాయిరెడ్డి ఎఫెక్ట్ ఎంత‌.. వైసీపీ లెక్క‌లేసేసింది ..

admin
Published by Admin — September 23, 2026 in Politics
News Image

రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌యసాయిరెడ్డి త్వ‌ర‌లోనే పార్టీ పెడ‌తాన‌ని ప్ర‌క‌టించారు. వ‌చ్చే ద‌స‌రా నాటికి ఆయ న పార్టీని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంటుంద‌ని తెలుస్తోంది. త‌న పార్టీ విష‌యంపై ఆయ‌న త‌రచుగా మాట్లాడుతున్నా రు. యువ‌త‌కు ప్రాధాన్యం ఇస్తామ‌ని అంటున్నారు. అంతేకాదు.. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌మ్మ‌, రెడ్డి ముఖ్య‌మం త్రులు మాత్రమే పాలించార‌ని.. దీనికి భిన్నంగా తాము వేరే సామాజిక వ‌ర్గానికి ముఖ్యంగా యువ‌త‌కు అవ‌కాశం ఇస్తామ‌ని చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో సాయిరెడ్డి పెట్టే పార్టీ ప్ర‌భావం త‌మ‌పై ఎంత మేర‌కు ఉంటుంద‌న్న విష‌యంపై వైసీపీ ఆరా తీసింది. దీనిలో ప్ర‌ధానంగా సాయిరెడ్డి వెంట వెళ్లే నాయ‌కులు, కేడ‌ర్‌..ద్వితీయ శ్రేణి నేత‌లు.. వంటి మూడు విభాగాలుగా అధ్య‌య‌నం చేసింది. ముఖ్యంగా జిల్లాల వారీగా చూసుకుంటే.. ప్ర‌స్తుతం అసంతృప్తితో ఉన్న నాయ‌కులు సాయి రెడ్డి వెంట న‌డిచేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. సాయిరెడ్డిని తొలుత త‌క్కువ‌గానే అంచ‌నా వేశారు. కానీ.. ఆయ‌న దూకుడు పెంచుతున్నారు.

వ‌రుస‌గా మీడియా ముందుకు వ‌స్తున్నారు. వైసీపీని ముఖ్యంగా ల‌క్ష్యం చేసుకుని కామెంట్లు చేస్తున్నారు. అదేసమ యంలో వైసీపీ కీల‌క నాయ‌కుడు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డిని ఉద్దేశించి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ ప‌రిణామా లతో వైసీపీలో స‌జ్జ‌ల‌ను వ్య‌తిరేకించే నాయ‌క‌గ‌ణం సాయిరెడ్డి వెంట న‌డిచినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు. అయితే.. ఇప్ప‌టికిప్పుడు ఇది జ‌ర‌గ‌క‌పోవ‌చ్చ‌ని.. సాయిరెడ్డి వ్యూహాలు, మున్ముందు ఆయ‌న అనుస‌రించే రాజ‌కీయ ఎత్తులు.. పై ఎత్తుల‌పై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని వైసీపీ ఒక అంచ‌నాకు వ‌చ్చింది.

ఏయే అంశాలు..

కొన్ని జిల్లాల్లో వైసీపీకి కేడ‌ర్ ఉన్నా.. అసంతృప్తితో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో అలాంటి వారు పార్టీ మారే అవ‌కాశం ఉంది. ఇక విశాఖ స‌హా ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో సాయిరెడ్డికి మంచి ప‌లుకుబ‌డి ఉంది. దీంతో ఆయ‌న ఆయా జిల్లాల్లో పైచేయిసాధించేందుకు ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. అలానే రెడ్డి సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న నెల్లూరు, సీమ జిల్లాల పైనా కొంత మేర‌క ప్ర‌భావం చూపించ‌వ‌చ్చ‌న్న అంచ‌నాలు వైసీపీకి వ‌స్తున్నాయి. మొత్తంగా సాయిరెడ్డి ప్ర‌భావాన్ని ముందు త‌క్కువ‌గానే అంచ‌నా వేసుకున్నా.. త‌ర్వాత కాలంలో మాత్రం వైసీపీ సీరియ‌స్‌గానే భావిస్తున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Tags
Ycp calculating Vijaya Sai Reddy effect
Recent Comments
Leave a Comment

Related News

Latest News