వైసీపీకి షాక్‌: ప‌ల్లె ఓటు అలా.. ప‌ట్ట‌ణ ఓటు ఇలా.. !

admin
Published by Admin — September 30, 2026 in Politics
News Image

వైసీపీకి గ‌త 2024 ఎన్నిక‌ల్లో 43-48 శాతం ఓటు బ్యాంకు ల‌భించింది. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేకత ఉన్నా కూడా.. ఈ మేర‌కు ఓటు బ్యాంకు రావ‌డం గ‌మ‌నార్హం. పైగా 11 అసెంబ్లీ స్థానాల‌కే ప‌రిమితం అయిన‌ప్ప‌టికీ.. ఈ స్థాయిలో ఓటు బ్యాంకును సొంతం చేసుకోవ‌డం వైసీపీకి భారీ ఊపు నిచ్చిన అంశంగానే చెప్పాలి. అయితే.. ఈ ఓటు బ్యాంకు స్థిరంగా ఉంటుందా? ఉందా? అనేది ప్ర‌శ్న‌. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఈ ఓటు బ్యాంకు స్థిరంగానే ఉంటుంద‌ని చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

దీనికి ప్ర‌ధానంగా మూడు కార‌ణాలు ఉన్నాయి. 1) కూట‌మి స‌ర్కారు దూకుడు: ప్ర‌భుత్వం ఓటు బ్యాంకును రెండుగా విభ‌జించిన‌ట్టు క‌నిపిస్తోంది. దీనిలో ఏ) ప‌ల్లె ఓటు బ్యాంకు: ప‌ల్లెల్లో వైసీపీకి సానుకూల‌త ఉంది. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అభిమానులు.. ఆయ‌న ప్ర‌భుత్వంలో ల‌బ్ధి పొందిన వారు త‌ర్వాత కాలంలో జ‌గ‌న్‌కు అనుకూలంగా మారారు. అయితే.. ఇప్పుడు ప‌ల్లె ఓటు బ్యాంకును అభివృద్ధి పేరుతో కూట‌మి త‌న‌వైపు తిప్పుకొంటోంది.  

బీ) ప‌ట్ట‌ణ ఓటు బ్యాంకు: ఆది నుంచి కూడా వైసీపీకి మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గం వేరుగా ఉంది. జ‌గ‌న్ విధానాలు, మూడు రాజ‌ధానులు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌, చెత్త‌పై ప‌న్ను.. మ‌ద్యం, ఇలా.. అనేక విష‌యాల్లో వైసీపీ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఓటు బ్యాంకునుదూరం చేసుకుంది. ఇప్పుడు వారిని కూడా కూట‌మి త‌న ద‌రికి చేర్చుకుంటోంది. దీంతో కూట‌మి స‌ర్కారు దూకుడు ఎక్కువ‌గా ఉంది. 2) సంస్థాగ‌తం: పార్టీ ప‌రంగా సంస్థాగత‌నాయ‌క‌త్వం బ‌లంగా ఉంటే.. అప్పుడు.. ఓటు బ్యాంకు స్థిరంగా ఉంటుంది. ఈ విష‌యంలో వైసీపీ వెనుక‌బ‌డింది.

ఒక‌ప్పుడు సంస్థాగ‌తంగా బ‌లంగా ఉన్న నాయ‌కులు ఇప్పుడు వైసీపీకి దూర‌మ‌య్యారు. దీంతో వారి అనుచ‌రులు, కార్య‌క‌ర్త‌లు కూడా.. వైసీపీకి దూరంగానే ఉంటున్నారు. 3) జ‌గ‌న్ ఇమేజ్‌: ఒక‌ప్ప‌డుఉ జ‌గ‌న్ ఇమేజ్ బాగానే ఉన్నా.. ఇప్పుడు మాత్రం బెడిసి కొడుతోంది. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల ద్వ‌యం ముందు.. జ‌గ‌న్ తేలిపోతున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. దీంతో ఇప్పుడున్న ఇమేజ్ స‌రిపోయే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు. సో.. మొత్తంగా అటు ప‌ల్లెల్లో అభివృద్ధి మంత్రంతో, ఇటు ప‌ట్ట‌ణాల్లో ఇమేజ్ సూత్రంతో కూట‌మి దూకుడు ముందు వైసీపీ ప‌రిస్థితి డోలాయమానంలో ప‌డింద‌ని అంటున్నారు. 

Tags
Shocking results for ycp ahead of local body elections
Recent Comments
Leave a Comment

Related News