ప్రశాంతంగా ముగిసిన రీపోలింగ్!

admin
Published by Admin — November 02, 2026 in Andhra
News Image

ఏపీలో ఈరోజు 13 చోట్ల రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగినా..(ఒక‌టి రెండు చోట్ల మాత్ర‌మే చెదురు మ‌దురు ఘ‌ట‌న‌లు జ‌రిగాయి) ఓట‌రు మాత్రం పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌క‌పోవ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం గా మారింది. 3 వేల 453 వార్డులకు సంబంధించి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తం గా 96 లక్షల 89వేల 061 మంది ఓటర్లు ఉండగా ...ఉదయం 7 గంటలకే ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియలో ఓటర్లు పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల స‌మ‌యానికి.. అంటే పోలింగ్ గ‌డువు పూర్త‌య్యే స‌మ‌యానికి 48 లక్షల 54 వేల 133 మంది ఓటర్లు మాత్ర‌మే ఓట్లు వేశారు.  

అంటే సుమారు 49.98 శాతం మంది మాత్ర‌మే ఓటు హ‌క్కు వినియోగించుకున్న‌ట్టు అధికారిక లెక్క‌లు చెబుతున్నా యి. అయితే.. పూర్తిస్థాయి గ‌ణాంకాలు వ‌చ్చేందుకు స‌మ‌యం ప‌డుతుంద‌ని ఎన్నిక‌ల సంఘం పేర్కొంది. విజ‌య వాడలోని ఒక్క 55వ డివిజ‌న్‌లో అభ్య‌ర్థుల పేర్లు, ఎన్నిక‌ల గుర్తులు తారుమార‌వ‌డంతో ఇక్క‌డ రాత్రి 7.30 గంట‌ల వ‌ర‌కు పోలింగ్‌ను కొన‌సాగించారు. దీంతో పూర్తిస్థాయి లెక్క‌ల కోసం వేచి చూడాల‌న్నారు. పోనీ.. ఎలా చూసుకున్నా.. 50 శాతం కూడా ఓట‌ర్లు ఈ ఎన్నిక‌ల్లో పాల్గొన‌లేద‌న్న సంగ‌తి స్ప‌ష్టం అవుతోంది.

సీఎం చంద్ర‌బాబు జోక్యం..

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల స‌మ‌యంలో ఓటింగ్ స‌ర‌ళిని గ‌మ‌నించిన సీఎం చంద్ర‌బాబు.. తానే స్వ‌యంగా జోక్యం చేసుకున్నారు. పార్టీ ముఖ్య నాయ‌కుల‌తో వీడియో కాన్ఫ‌రెన్సు నిర్వ‌హించారు. ఓటింగ్ శాతం పెర‌గాలంటే.. నాయ‌కులు ఓట‌ర్ల‌ను పోలింగ్ బూతుల వ‌రకు తీసుకురావాల‌ని సూచించారు. ఎక్క‌డెక్క‌డ త‌క్కువ శాతం ఓటింగ్ న‌మోదైందో.. అక్క‌డ‌క్క‌.. ఓట‌ర్లను తీసుకువ‌చ్చేందుకు కృషి చేయాల‌న్నారు. ఆ త‌ర్వాత‌.. 5 శాతం మేర‌కు ఓటింగ్ పెరిగినా.. ఓవ‌రాల్‌గా రాష్ట్రంలో 50 శాతాన్ని కూడా దాట‌లేక పోయింద‌న్న‌దిస్ప‌ష్ట‌మైంద‌ని టీడీపీ వ‌ర్గాలు కూడా అంచ‌నా వేశాయి.

కార‌ణం ఏంటి?

అయితే.. కొన్ని కొన్ని జిల్లాల్లో మునిసిప‌ల్‌కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో 60-70 శాతం వ‌ర‌కు పోలింగ్ జ‌రిగింది. కానీ, మ‌రికొన్ని జిల్లాల్లో 45 శాతం దాట‌లేదు. ఇంకొన్ని చోట్ల మాత్రం 36-40 మ‌ధ్యే పోలింగ్ శాతం ఊగిసలాడింది. ఇలా.. రాష్ట్రంలో స‌గ‌టున 50-51 శాతం మ‌ధ్యే పోలింగ్ న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని ఎన్నిక‌ల సంఘం అధికారులు కూడా ఆఫ్ దిరికార్డుగా అభిప్రాయ‌ప‌డ్తారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఆదివారం కావ‌డంతో కుటుంబాలు వీకెండ్‌లో మునిగిపోయి ఉంటాయ‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డ్డారు. మ‌రికొన్ని చోట్ల తుఫాను ఎఫెక్ట్ కార‌ణంగా బ‌య‌ట‌కు రాలేక పోయి ఉండొచ్చ‌ని అంటున్నారు.

Tags
Repolling in AP finished today
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News