వైసీపీ నేతలకే ఇది సాధ్యం!

admin
Published by Admin — November 04, 2026 in Andhra
News Image

ఎన్నికల్లో ఓటుకు నోటు పంచడం అనేడి ఒక జమానాలో గుట్టుచప్పుడు కాకుండా జరిగేది. డబ్బులు పంచే నాయకులు..తీసుకునే ఓటర్లు కూడా సైలెంట్ గా డబ్బులు చేతులు మార్చుకునేవారు. అప్పట్లో కొంతమంది ఓటర్లకు డబ్బులు అందకపోయినా సరే ఆ డబ్బులపై మన పేరు రాసిలేదులే అనుకొని నచ్చిన వారికి ఓటేసి వచ్చే వారు. ఒకవేళ డబ్బులు ఇచ్చిన నాయకులు ఓడిపోతే..మనకు ఇంతే రాసి పెట్టి ఉంది అని నాయకులు గమ్మునుండేవారు. అయితే, ఆ జమానా వేరు. ఇది ‘పోకిరి’ జమానా. ఇప్పుడు ఓటర్లు, నాయకులు ఆండ్రాయిడ్ వెర్షన్ మాదిరిగా ఏ ఎన్నికలకు ఆ ఎన్నికలు అప్డేట్ అవుతున్నారు.

తమ ఓటుకు నోటు రాకుంటే రోడ్ల మీదకు వచ్చి మరీ ధర్నాలు చేస్తున్నారు ఓటర్లు. ఇక, నాయకులైతే డబ్బు, వస్తువులు తీసుకొని ఓటేయకుంటే తమ వస్తువులు, డబ్బులు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కౌన్సిలర్ ఒకరు సరికొత్త తరహాలో ఓటర్లను బెదిరిస్తున్న వైనం హాట్ టాపిక్ గా మారింది. తనకు ఓటు వేయని వాళ్లు తన దగ్గర తీసుకున్న 1000 రూపాయలు తిరిగి ఇవ్వాలని, లేకుంటే వాళ్ల ఇంటి ముందు టెంటు వేస్తానని సిల్లీ వార్నింగ్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో, వైసీపీ నాయకులు ఎంతకు తెగించార్రా అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి.

చిత్తూరు జిల్లా పలమనేరు 32వ వార్డుకు వైసీపీ తరఫున ప్రసాద రెడ్డి పోటీ చేసి 400 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే, తాను 10 రూపాయల వడ్డీకి 10 లక్షలు అప్పు చేసి మరీ ఒక్కో ఓటును 1000 రూపాయలు పెట్టి కొన్నానని సగర్వంగా చెబుతున్నారు ప్రసాద రెడ్డి. అంతేకాదు, మారెమ్మ ఫొటో మీద ఒట్టు వేసి మరీ తన దగ్గర డబ్బులు తీసుకున్నారని, ఆమెను అమ్మేశారని, ఆమె కోపానికి వారంతా బలికావాల్సిందేనని శపించారు కూడా. అయితే, ఆ డబ్బులు తాను తీసుకోనని, ఆ డబ్బుతో తన వార్డు ప్రజలకు మాట ఇచ్చినట్లుగా వాటర్ ప్లాంట్ పెట్టిస్తానని అంటున్నారు.

ఎన్నికల్లో ఓటర్లను డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టడం చట్టరీత్యా నేరం అని తెలిసినా ఇలా పబ్లిక్ గా డబ్బులిచ్చాను అని వీడియో పెట్టడం బహుశా వైసీపీ నేతలకే చెల్లుతుంది. ఇక, నా డబ్బులు నాకివ్వకుంటే మీ ఇంటి కొస్తా..నట్టింటికొస్తా అంటూ బాలయ్య బాబు రేంజ్ లో వార్నింగ్ ఇవ్వడం ఫన్నీగా ఉంది. ఎన్నికల కమిషన్ గనక ఈ వీడియోను..ప్రసాద రెడ్డి డైలాగులను సీరియస్ గా తీసుకుంటే ఆయనపై కేసు కూడా నమోదయ్యే అవకాశాలున్నాయి.

Tags
Ycp leaders can do things
Recent Comments
Leave a Comment

Related News