తెలంగాణలో కొందరు పారిశ్రామికవేత్తలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడే పారిశ్రామికవేత్తలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని హెచ్చరించారు. పొరపాటున హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరిట జరుగుతున్న స్కామ్ లో భాగస్వాములు అయితే ఆ తర్వాత అనుభవించేది ఆ పారిశ్రామికవేత్తలేనని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
మరో ఏడాదిలో కేసీఆర్ రాబోతున్నారని కేటీఆర్ జోస్యం చెప్పారు. ఆ తర్వాత తమను నిందించవద్దని కేటీఆర్ హెచ్చరించారు. దేవుడి దయతో, ప్రజల ఆశీర్వాదంతో రాబోయే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని, తమ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం తప్పకుండా వస్తుందని, వచ్చిన వెంటనే ఆ భూములకు చెక్ పెడతామని అన్నారు. ఆ భూములు వెనక్కి తీసుకుంటామని, అక్కడ ఒక ఇంచ్ స్థలం కొన్నా అది వెనక్కు తీసుకుంటామని చెప్పారు. అంతేకాదు, వేలకోట్ల రూపాయలు కమిషన్లకు ఆశపడి బేరసారాలు జరిపినా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.