కూటమిపై ప్రజా విశ్వాసం రుజువైంది: చంద్రబాబు

admin
Published by Admin — November 10, 2026 in Politics
News Image

2024లో కూట‌మిని ప్ర‌జ‌లు మ‌న‌స్ఫూర్తిగా ఆద‌రించార‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తెలిపారు. ఇప్పుడు తాజా గా జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లోనూ ప్ర‌జ‌లు అలానే ప‌ట్టంక‌ట్టార‌ని చెప్పారు. 2024లో 94 శాతం స్ట్ర‌యిక్ రేట్ ద‌క్కించుకు న్నామ‌న్న ఆయ‌న‌.. ఇప్పుడు రెండున్న‌రేళ్ల కూట‌మి పాల‌నను చూసిన ప్ర‌జ‌లు 94.6 శాతం మేరకు స్ట్ర‌యిక్ రేట్ ఇచ్చి ఆశీర్వదించార‌ని తెలిపారు. కూట‌మి ప్ర‌భంజ‌న విజ‌యం పూర్తిగా ప్ర‌జ‌ల వ‌ల్లే సాకారం అయింద‌ని చెప్పారు.

తాజాగా మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి మీడియాతో మాట్లాడారు. కూట‌మిపార్టీల ఐక్య‌త‌ను భ‌గ్నం చేసేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నించార‌ని.. కానీ, ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో కూట‌మి బ‌లంగా ఉంద‌ని అన్నారు. వైసీపీని ప్ర‌జ‌లు ఎప్పుడో ప‌క్క‌న పెట్టార‌ని అన్నారు. క‌డ‌ప‌లో కూడా టీడీపీ విజ‌యం ద‌క్కించుకోవ‌డం వెనుక ప్ర‌జ‌లు ఆ పార్టీని ఏమేర‌కు ద్వేషిస్తున్నారో అర్థ‌మైంద‌ని తెలిపారు. ప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తిలో ఎన్నిక‌లు జ‌రిగితే.. క‌డ‌ప‌లోనూ టీడీపీ కూట‌మిదే విజ‌యమ‌ని నిరూపించార‌న్నారు.

డ‌బ్బుల కోసం రాజ‌కీయాలు చేయొద్ద‌ని ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు సూచించారు. రాజ‌కీయాలు అంటే పూర్తిగా సేవా దృక్ఫ‌థంతో కూడిన‌వ‌ని.. డ‌బ్బుల కోసం కాద‌ని అన్నారు. నేటి త‌రం యువ‌త సేవా భావంతో రాజ‌కీయాల్లోకి రావాల‌ని సూచించారు. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌లు.. అనంత‌రం వ‌చ్చిన ఫ‌లితాలు కూట‌మి ప్ర‌భుత్వంపై మ‌రింత బాధ్య‌త‌ను పెంచాయ‌న్నారు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు ఈ ఎన్నిక‌లు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. వారి ఆకాంక్ష‌లు నెర‌వేర్చేం దుకు ప్ర‌భుత్వం శాయ‌శ‌క్తులా కృషి చేస్తుంద‌ని వివ‌రించారు.

పెద్ద నోట్ల ర‌ద్దు నేనే చెప్పా..

కాగా, దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దు జ‌రిగి ప‌దిసంవ‌త్స‌రాలు పూర్త‌యిన సంద‌ర్భాన్ని సీఎం చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు. 2016కు ముందు తానే దేశంలో పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేయాల‌ని సిఫార‌సు చేశాన‌న్నారు. పెద్ద‌నోట్ల కార‌ణంగా దేశంలో అవినీతి పెరిగిపోయింద‌న్నారు. ఈ కార‌ణంగానే పెద్ద‌నోట్ల ర‌ద్దు జ‌రిగింద‌న్నారు. ప్ర‌స్తుతం 10, 20, 50, 100 నోట్లు ఉంచి ఇక‌, నుంచి ప్ర‌స్తుతం ఉన్న 500 నోట్ల‌ను కూడా ర‌ద్దు చేయాల‌న్న‌దిత‌న సూచ‌న‌గా చెప్పారు. అంతేకాదు.. దేశంలో డిజిటల్ క‌రెన్సీని పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. అప్పుడు అవినీతి పూర్తిగా త‌గ్గుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. 

Tags
Cm chandrababu
Recent Comments
Leave a Comment

Related News