తనను జైలుకు పంపించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. దీనికి తాను సిద్ధమేనని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నాయకుడు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. దీనికి ముందు ఆయన మీడియా తో మాట్లా డారు. ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతున్నామని.. అందుకే బీఆర్ ఎస్‌పై కక్ష కట్టారని వ్యాఖ్యానించా రు. ఎన్ని విధాల తమను ఇబ్బందులకు గురి చేసినా.. తమ పోరాటం ఆగబోదని చెప్పారు.
`ప్రజల తరఫున పోరాడేందుకు.. మాకు ఎవరి ఆంక్షలూ పనిచేయవు. ప్రజలే ఫస్ట్ నినాదం మాది. ఎన్నిక ల సమయంలో ఇచ్చిన గ్యారెంటీలపై ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే.. వీటిని మేం ప్రశ్నిస్తున్నాం. దీనికి కక్షగట్టిన ప్రభుత్వం మాపై దాడి చేస్తోంది. లేనిపోని కేసులో నా పేరు ఇరికించింది. ఇది టైంపాస్ కేసు. ప్రజల దృష్టిని ప్రజా సమస్యల నుంచి తప్పించేందుకు వేసిన ఎత్తుగడ. దీనిని మేం ఎదుర్కొంటాం. ప్రజా పోరాటంలో అవసరమైతే.. జైలుకు కూడా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం“ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఏ1గా..
ఇక, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరమీదకు తెచ్చిన ఫార్ములా ఈ -కార్ రేస్ కేసులో కేటీఆర్‌ను ఏ1గా పేర్కొ న్నారు. ఈ రేసుకు సంబంధించి నిధుల దుర్వినియోగంతోపాటు, అధికార దుర్వినియోగం కూడా జరిగిం దని అధికారులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే రెండు సార్లు ఆయనకు నోటీసులు ఇచ్చారు. తాజాగా కేటీఆర్ అధికారుల ముందు హాజరయ్యారు. ముఖ్యంగా ఈ కేసులో విదేశీ కంపెనీకి నగదు బదిలీకి సంబంధించి అధికారులు సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది.