ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!

admin
Published by Admin — June 17, 2025 in Politics, Andhra
News Image

మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత జ‌గ‌న్ చాలా బ్యాడ్ అయిపోతున్నారా? ఆయ‌న విధానాలు.. ప‌ద్ధ‌తులు కూడా ఆయ‌న‌ను అభిమానించేవారిని సైతం బాధిస్తున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా జగన్ విషయాన్ని తీసుకుంటే రాష్ట్రంలో ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్ గా మారింది, జగన్ దాదాపు 2009 నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు. అప్పట్లో ఎంపీగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. తండ్రి చాటు బిడ్డగా ఆయన మెలిగారు. 2014లో ప్రధాన ప్రతిపక్షంగా మారారు.

2019లో ఏకంగా 151 స్థానాలతో అధికారంలోకి కూడా వచ్చారు. ఇక 2024 కు వచ్చేసరికి మాత్రం దారుణంగా 11 స్థానాలకు పడిపోయారు. ఇది ఎలా ఉన్నా 2019 వరకు కూడా జగన్ విషయంలో ఒక స్థాయి నమ్మకం ఒక స్థాయి విశ్వాసం ఉండేది. అంతేకాదు వైఎస్ కుమారుడిగా కూడా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకు న్నారు. కానీ, ఎందుకో అనూహ్యంగా 2019 తర్వాత నుంచి ఆయన బ్యాడ్ అవుతూ వచ్చారు. 2023 నుంచి ఈ గ్రాఫ్ మరింతగా దెబ్బతింటూ రావడం గమనార్హం.

జగన్ అంటే ఒకప్పుడు వైయస్ బిడ్డగా ప్రతిపక్ష నాయకుడిగా కూడా గుర్తించిన ప్రజలు ఆ తర్వాత ఆయన అనుసరిస్తున్న విధానాలు ఆయన వ్యవహరిస్తున్న తీరును చూసి విస్మయం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితులలో `ఇంత‌ బ్యాడ్` అవుతారని ఎవరు ఊహించకపోవడం కూడా నమ్మలేని నిజం. 2023 వరకు కూడా ఒక మాదిరిగా ఉన్నా పర్వాలేదు అనిపించింది. కానీ, ఇప్పుడు మాత్రం జగన్ అంటే అత్యంత బ్యాడ్ అయిపోయినటువంటి నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారినే చెప్పాలి.

ఇది వైసిపి హార్డ్ కోర్ బృందాలకు ఇబ్బంది కలిగించినా.. పబ్లిక్ లో మాత్రం జగన్ అంటే `చాలా బ్యాడ్` మాటే వినిపిస్తోంది. మహిళలపై జర్నలిస్ట్ కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విష‌యం తెలిసిందే. దీనిపై జగన్ స్పందించి ఉంటే, జగన్ ఒక నిర్ణయం తీసుకుని ఉంటే ఇంత బ్యాడ్ అయ్యేవారు కాదేమో అనే చర్చ కూడా ఉంది. అదే విధంగా ఆయనకు ఇస్తున్నటువంటి సలహాలు ఆయన పాటిస్తున్నటువంటి కార్యక్రమాలు వంటివి కూడా కొంత బ్యాడ్ ను చేశాయని చెప్పాలి. మరి ఇప్పటికైనా ఆయన తన పద్ధతి, విధానాలు మార్చుకుంటారో లేదో చూడాలి.

Tags
bad name comments on amaravati women ex cm jagan
Recent Comments
Leave a Comment

Related News