లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత

admin
Published by Admin — June 17, 2025 in Politics, Andhra
News Image

ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి పేరు చాలాకాలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. చెవిరెడ్డి కూడా ఈ కేసులో తనను రేపో మాపో అరెస్టు చేస్తారని లీకులిస్తున్నారు. దీంతో, తప్పు చేశారు కాబట్టే అరెస్టు గురించి, కేసు గురించి చెవిరెడ్డి భయపడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చెవిరెడ్డిపై ఆల్రెడీ లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే బెంగళూరు ఎయిర్ పోర్టులో చెవిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.

బెంగళూరు నుంచి కొలంబో వెళ్లేందుకు ప్రయత్నించిన చెవిరెడ్డికి పోలీసులు చెక్ చెప్పారు. దేశం విడిచి వెళ్లకూడదని లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయని, అందుకే చెవిరెడ్డిని అడ్డుకున్నామని పోలీసులు చెప్పారు. ఈ షాక్ నుంచి తేరుకోక ముందే చెవిరెడ్డిని ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా చేర్చింది సిట్. ఎఫ్ఐఆర్ లో చెవిరెడ్డిని ఏ38గా పేర్కొన్న సిట్ అధికారులు కోర్టులో మెమో దాఖలు చేశారు. చెవిరెడ్డి స్నేహితుడు వెంకటేష్‌ నాయుడును ఏ34గా చేర్చారు.

 
Tags
Ap Liquor Scam chevireddy as a38 look out notice on chevireddy
Recent Comments
Leave a Comment

Related News