ఏపీ లిక్కర్ స్కాం కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి పేరు చాలాకాలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. చెవిరెడ్డి కూడా ఈ కేసులో తనను రేపో మాపో అరెస్టు చేస్తారని లీకులిస్తున్నారు. దీంతో, తప్పు చేశారు కాబట్టే అరెస్టు గురించి, కేసు గురించి చెవిరెడ్డి భయపడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చెవిరెడ్డిపై ఆల్రెడీ లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే బెంగళూరు ఎయిర్ పోర్టులో చెవిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.
బెంగళూరు నుంచి కొలంబో వెళ్లేందుకు ప్రయత్నించిన చెవిరెడ్డికి పోలీసులు చెక్ చెప్పారు. దేశం విడిచి వెళ్లకూడదని లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయని, అందుకే చెవిరెడ్డిని అడ్డుకున్నామని పోలీసులు చెప్పారు. ఈ షాక్ నుంచి తేరుకోక ముందే చెవిరెడ్డిని ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా చేర్చింది సిట్. ఎఫ్ఐఆర్ లో చెవిరెడ్డిని ఏ38గా పేర్కొన్న సిట్ అధికారులు కోర్టులో మెమో దాఖలు చేశారు. చెవిరెడ్డి స్నేహితుడు వెంకటేష్ నాయుడును ఏ34గా చేర్చారు.