తెలంగాణ సినీ రంగానికి సీఎం రేవంత్ రెడ్డిబిగ్ ఆఫర్ ఇచ్చారు. `ఏం కావాలో చెప్పండి.. చేసేందుకు, ఇచ్చేందుకు కూడా సిద్ధం గా ఉన్నాం.“ అని ఆయన ప్రకటించారు. తాజాగా శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన `గద్దర్ సినీ అవార్డుల వేడుక`లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక విషయాలు వెల్లడించారు తమ ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ.. అవి సినీ రంగాన్ని బలోపేతం చేసేందుకేనని..ఎవరినీ నొప్పించేందుకు కాదని తెలిపారు. ప్రభుత్వం పరంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు.
అదేసమయంలో ఇండస్ట్రీ డెవలప్‌మెంటు కోసం.. ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని చెప్పారు. అందరికీ మెరుగై న సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గత 14 సంవత్సరాలుగా రాష్ట్రంలో సినీ రంగానికిఎలాంటి అవార్డులు దక్కలేద న్న ఆయన.. ఇప్పుడు నంది అవార్డుల పేరును తెలంగాణ వాగ్గేయ కారుడు గద్దర్ పేరుతో ఇస్తున్నామని చెప్పారు. కళలు, కళాకారుల పట్ల తమ ప్రభుత్వానికి ఎనలేని గౌరవం ఉందన్నారు. ఒకప్పుడు.. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అనేక మార్పులు వచ్చాయని చెప్పారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి హైదరాబాద్ వేదికగా మారడం తెలంగాణకు గర్వకారణనమన్నారు.
తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యం పెట్టుకున్నామన్నారు. ఈ క్రమంలోనే అనేక చర్య లు చేపడుతున్నామన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి వికసిత తెలంగాణగా రాష్ట్రా న్ని నిలబెట్టాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు. “ఈ రోజు ప్రపంచమే గుర్తించే విధంగా అద్భుతమైన సినిమాలు తీసే రాజమౌళిలాంటి దర్శకులు హాలీవుడ్‌ను ఈ గడ్డపైకి ఎందుకు తీసుకురావటం లేదు. మీకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. అందుకు మీకు ఏం కావాలో చెప్పండి.“ అని సీఎం రేవంత్ రెడ్డి బిగ్ ఆఫర్ ప్రకటించారు.