ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే దర్శక ధీరుడు రాజమౌళి టాప్ ప్లేస్ లో ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కెరీర్ ఆరంభం నుంచి అపజయం ఎరగని దర్శకుడిగా పేరు తెచ్చుకోవడమే గాక.. తన సినిమాలతో తెలుగు జాతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చాటి చెప్పారాయన. అటువంటి రాజమౌళి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? గెస్ చేస్తే మీరు గ్రేట్ అబ్బా.
ఎందుకంటే ఫస్ట్ రెమ్యునరేషన్ అనగానే లక్షల్లో లేదా వేలల్లో అందుకుని ఉండుంటారని అనుకుంటారు. కానీ కాదు.. సినిమా పరిశ్రమలో రాజమౌళి తొలి పారితోషికం రూ 50. అవును, మీరు విన్నది నిజమే. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా వెల్లడించారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన `కుబేర` మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జక్కన్న స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా హోస్ట్ సుమ ఆయనతో చిట్ చాట్ చేసింది.
ఈ క్రమంలోనే `మీ తొలి రెమ్యునరేషన్ ఎంత?` అని ప్రశ్నించగా.. అసిస్టెంట్ ఎడిటర్ గా పని చేసిన టైమ్ లో తొలిసారి రూ. 50 రూపాయలు అందుకున్నాను. అదే నా ఫస్ట్ రెమ్యునరేషన్. అయితే ఆ 50 రూపాయలతో ఏం చేశాను అన్నది మాత్రం గుర్తులేదు అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలియగానే సినీ ప్రియులు షాకైపోతున్నారు. ఇక 50 రూపాయిలతో మొదలైన రాజమౌళి ప్రయాణం.. ఇప్పుడు ఒక్కో చిత్రానికి దాదాపు రూ. 50 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చేరింది. కాగా, రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో `ఎస్ఎస్ఎమ్‌బీ29` వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నారు. ప్రియాంక చోప్రా ఇందులో హీరోయిన్. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.