కొడాలి నాని లొకేషన్ దొరికింది…ఇదిగో ప్రూఫ్!

admin
Published by Admin — May 24, 2025 in Andhra
News Image

వైసీపీ నేత, మాజీ మంత్రి…అలియాస్ బూతుల మంత్రి కొడాలి నానిని రేపో మాపో పోలీసులు అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలో ఉండగా కొడాని నాని నోటికి వచ్చినట్లు టీడీపీ, జనసేన నేతలను దుర్భాషలాడిన నేపథ్యంలో ఆయనపై చట్టమపరమైన చర్యలు తప్పవని టాక్. అయితే, అనారోగ్యం కారణాలతో ఆసుపత్రికి వెళ్లారు కొడాలి నాని. ఆ క్రమంలోనే ఆయన మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లబోతున్నారని తెలుస్తోంది.

అయితే, కేసుల భయంతో..అరెస్టు నుంచి తప్పించుకునేందుకు నాని దేశం విడిచి పారిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే నానిపై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే, ఆల్రెడీ నాని దేశం విడిచి వెళ్లారని కొందరు…అజ్ఞాతంలో ఉన్నారని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అందరికీ షాకిస్తూ హైదరాబాద్ లో ఓ పెళ్లి రిసెప్షన్ కు నాని హాజరైన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

హైదరాబాద్ లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న కుంకుమాస్ సంధ్య కన్వెన్షన్ లో శుక్రవారం రాత్రి 9.30 సమయంలో ఓ ఈవెంట్ కు నాని అటెండ్ అయిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాని ఎక్కడ…ఎక్కడ..అని అంతా అనుకుంటున్న టైంలో ఆయన పొరుగు రాష్ట్రంలోనే ఉండడం విశేషం. దీంతో, నాని అరెస్టుకు రోజులు దగ్గర పడ్డాయి అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కొడాలి నాని లొకేషన్ దొరికింది…ఇదిగో ప్రూఫ్!

Tags
Kodali nani in Hyderabad kondali nani's arrest ycp leader kodali nani
Recent Comments
Leave a Comment

Related News