ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంశల జల్లుకురిపించారు. “బాబు భేష్“ అం టూ చప్పట్లతో తన హర్షాతిరేకాలను వెల్లడించారు. తాజాగా కొత్త ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశం లో ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీతో పాటు దేశం ప్రగతి కోసం.. చంద్రబాబు ఇచ్చిన ప్రజెంటేషన్‌ను ప్రధాని మోడీ ఆసక్తిగా తిలకించారు. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. చంద్రబాబు విజన్.. దేశానికి అవసరమని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ప్రస్తావించిన అనేక అంశాలు.. తాము ప్రతిపాతిస్తున్న.. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వికసిత భారత్ కు ఎంత ఉపయోగపడతాయన్నారు. అదేవిధంగా రాష్ట్రాలకు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని మోడీ కితాబునిచ్చారు. అంతేకాదు.. పీ-4పై ప్రధాని ప్రశంసలుకురిపించారు. సమాజంలో ఉన్నతస్థాయి వర్గాలను పేదలకు చేరువ చేయడం ద్వారాసమాజంలో పేదరికాన్ని తగ్గించే ఐడియా చాలా బాగుందని తెలిపారు. ఇది కూడా ఆచరణ దాయకమేనని పేర్కొన్నారు.
వనరులను వినియోగించుకునే విధానంపై చంద్రబాబు ఇచ్చిన ప్రెజంటేషన్ చాలా బాగుందన్న ప్రధాని స్వయం వృద్ధికి బాటలు పరిచేలా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రాలు స్వయం ప్రకాశితాలు కావాలన్నదే తమ ఆలోచన అని ప్రధాని చెప్పుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు అదే పనిచేస్తున్నారని తెలిపారు. ఈ తరహా ఆలోచనలను అందిపుచ్చుకుని రాష్ట్రాలు అబివృద్ధి చెందాలని ప్రధాని సూచించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కృషిని మోడీ ప్రసంశించారు. తాము కూడా అధ్యయనం చేస్తామని.. చెప్పడం గమనార్హం.