దేశంలో దాదాపు 15 సంవత్సరాల కిందట జరగాల్సిన జనాభా గణనకు తాజాగా కేంద్రంలోని ప్రధాని మోదీ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2011లో జరగాల్సిన లెక్కలు అనివార్య కారణాలతో వాయిదాపడ్డా యి. ఆ తర్వాత.. కరోనా కారణంగా మరోసారి వాయిదా పడుతూ వచ్చాయి. ఇక, ఆ తర్వాత.. ఎన్నికలు .. హడావుడి నేపథ్యంలో కేంద్రం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చింది. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది.

దేశంలో రెండు విడతల్లో జనగణన చేపట్టేందుకు కూడా తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. దీనిలో 34 లక్షల మంది ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లను నియమించనున్నారు. రాష్ట్రాల వారీగా ఆయా ప్రభుత్వాలే.. వీరిని నియమించాల్సి ఉంటుంది. జనగణనతో పాటు కులగణనకు నిర్ణయించారు. అంటే.. కులాల ప్రాతిపదికన కూడా జనాభా ఎంత ఉందన్నది తేల్చనున్నారు.
తొలి దశలో జమ్ము, ఉత్తరాఖండ్, హిమాచల్, లడఖ్(కేంద్ర పాలిత ప్రాంతం)లో 2026 అక్టోబర్ 1లోపు జనాభా, కుల గణనను కూడా పూర్తిచేస్తారు. మిగతా రాష్ట్రాల్లో 2027 మార్చి 1 నాటికి జనగణన పూర్తి చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా సంబంధిత పోర్టల్స్, యాప్స్‌లో ప్రజలు తమ వివరాల నమోదు చేసుకునేందుకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నట్టు తాజా గెజిట్‌లో వివరించారు.