జ‌న‌సేన ముచ్చ‌ట‌.. కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదా ..!

admin
Published by Admin — June 17, 2025 in Politics, Andhra
News Image

జ‌న‌సేన.. రాష్ట్రంలో పార్టీలు కూట‌మిగా ముందుకు సాగేందుకు., వైసీపీని అధికారం నుంచి దించేందుకు కీల‌క‌మైన పొలిటిక‌ల్ రోల్ పోషించిన పార్టీ. భ‌విష్య‌త్తులో ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాల‌కు కూడా ఈ పార్టీ కేరాఫ్‌గా నిలిచింది. రాబోయే 15 ఏళ్ల త‌ర్వాత‌.. అంటూ.. పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక ల‌క్ష్యాన్ని త‌ర‌చు గా వినిపిస్తున్నారు. అయితే… ఈ ల‌క్ష్యం సాధించాల‌న్నా.. క్షేత్ర‌స్థాయిలో పార్టీ పుంజుకునేలా చేయాల న్నా.. బ‌ల‌మైన కార్య‌క‌ర్త‌లు, బ‌ల‌మైన నాయ‌కుల అవ‌స‌రం ఎంతైనా ఉంది.

నాయ‌కులు ఉన్నారు.. అదేస‌మ‌యంలో జ‌న‌సేన‌కు కార్య‌క‌ర్త‌లు కూడా ఉన్నారు. అయితే.. పైకి అంద‌రూ ఎలా ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌ల‌ను మాత్రం ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న టాక్ త‌ర‌చుగా వినిపి స్తోంది. వాస్త‌వానికి కార్య‌క‌ర్త‌ల‌కు ప‌నులు చేయాల‌న్నా.. వారిని సంతృప్తి ప‌ర‌చాల‌న్నా.. పార్టీకి ఇదే కీల‌క మైన స‌మ‌యం. పార్టీ అధికారంలో ఉంది కాబ‌ట్టి.. ఇక‌, తిరుగులేద‌న్న‌ట్టుగా కార్య‌క‌ర్త‌లు ఉన్నారు. తాము కోరుకున్న ప‌నులు కూడా జ‌రుగుతాయ‌ని భావిస్తున్నారు. ఇది ఏ పార్టీలో అయినా స‌హ‌జ‌మే.

టీడీపీలో అయినా.. బీజేపీ అయినా.. కూట‌మిగా అధికారంలో ఉన్న‌ప్పుడు.. అంతో ఇంతో త‌మ ప‌నులు చేసి పెడ‌తార‌ని.. కార్య‌క‌ర్త‌లు భావిస్తారు. టీడీపీలో కొంత మేర‌కు ఇది జ‌రుగుతోంది. బీజేపీ విష‌యానికి వ‌స్తే.. నాయ‌కులు బిజీగా ఉండ‌డంతో కార్య‌క‌ర్త‌ల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం లేకుండా పోతోంది. అయితే.. జ‌న‌సేనలో అస‌లు కార్య‌క‌ర్త‌ల‌ను కూడా ద‌రికి చేరకుండా నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న టాక్ జోరుగా వినిపిస్తోంది. తాజాగా రాజాన‌గ‌రం ఎమ్మెల్యే వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు దారితీసింది.

గ‌తంలో నెల్లిమ‌ర్ల ఎమ్మెల్యే కూడా కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆమెపై వివాదాలు, విమ‌ర్శ‌లు ఆకాశాన్ని అంటేలా వ‌చ్చాయి. మొత్తానికి ఆమె స‌రిచేసుకున్నారు. తాజాగా రాజా న‌గ‌రం ఎమ్మెల్యే బ‌త్తుల రామ‌కృష్ణ కార్య‌క‌ర్త‌ల‌ను దూరం పెట్ట‌డం.. వారిపై దుర్భాష‌లాడ‌డం వంటివి వెలుగు చూశాయి. దీనికి సంబంధించి వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. చిత్రం ఏంటంటే.. త‌మ నాయ‌కులు దూకుడుగా ఉన్నా.. స‌ర్దుకుపోయే కార్య‌క‌ర్త‌లు.. ఇప్పుడు ఇలా వీడియో వైర‌ల్ అయ్యేలా చేశారు. అంటే.. వారు ఎంత‌గా ర‌గిలిపోతున్నార‌నేది చెప్ప‌డానికి ఇది ప్ర‌బ‌ల ఉదాహ‌ర‌ణ‌. మ‌రి పార్టీ ప‌రంగా.. కార్య‌క‌ర్త‌ల అసంతృప్తిని త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తారో లేదో చూడాలి.

Tags
janasena janasena cadre janasena cadre dissappointed janasena chief pawan kalyan negligence
Recent Comments
Leave a Comment

Related News