ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామిరెడ్డి గత ప్రభుత్వంలో వైసీపీకి అనధికారిక ఏజెంట్ లా పనిచేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే, వైసీపీ నేతల మాదిరిగా వెంకట్రామిరెడ్డి కూడా ఫ్రస్ట్రేషన్ లో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. పోలీసులను దుస్తులు విప్పదీసి నిలబెడతా అంటూ వైసీపీ అధినేత జగన్ అన్న మాటలను వెంకట్రామిరెడ్డి ఆదర్శంగా తీసుకున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత మిమ్మల్ని ఎవరు కాపాడతారని డైరెక్ట్ గా పోలీసులకు ఆయన వార్నింగ్ ఇచ్చిన తీరు హాట్ టాపిక్ గా మారింది.
సింగయ్య కారు ప్రమాదం కేసు గురించి మాట్లాడిన ఆయన...పోలీసుల తీరును తప్పుబట్టారు. ఆ ప్రమాదంపై ఎస్పీ మొదట ఒక స్టేట్ మెంట్ ఇచ్చారని, రెండు రోజులకే మాట మార్చారని అన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ఒకవేళ ఇది తప్పుడు కేసు అని తేలితే పోలీసులను ఎవరు కాపాడతారని ఆయన రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దరిద్రంగా, నీచస్థాయికి దిగజారిందని విమర్శించారు.
ఈ క్రమంలోనే ఆయనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. గతంలో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డి సస్పెన్షన్‌కు గురయ్యారని, అయినా సరే ఇప్పటికీ జగన్‌కు మద్దతుగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఉద్యోగుల సమస్యల కోసం పెట్టిన సమావేశంలో రాజకీయ కామెంట్లు ఏంటని మండిపడుతున్నారు.